రజనీకాంత్ క్రేజీ ప్రాజెక్టు కుచేలుడులో ఒక పాటకు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 25 మంది మెయిన్ డాన్సర్స్ , 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ లు పాల్గొంటున్నారు. చంద్రముఖి రీమేక్ తో సంచలన విజయం సొంతం చేసుకున్న పి.వాసు దీనికి దర్శకుడు. చెన్నైలో ప్రారంభమయిన ఈ ద్విభాషా చిత్రం మళయాళంలో సూపర్ హిట్టయిన కథ పరయుంబోల్ చిత్రానికి రీమేక్. అందులో ముమ్ముట్టి, శ్రీనివాసన్ లు నటించిన పాత్రలను తమిళంలో రజనీకాంత్, పశుపతి చేస్తున్నారు. తెలుగులో పశుపతి పాత్రను జగపతిబాబు చేస్తున్నాడు.రజనీకాంత్ ఇందులో నిజ జీవిత పాత్రను చేయటం మరో విశేషం. నిజానికి ఈ సినిమా లో బడ్జెట్ తో మలయాళంలో రూపొందింది. అందుకే ఒక పాటకు కోటి రూపాయలు ఖర్చు పెడుతూంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ ఖర్చుతో ఓ చిన్న బడ్జెట్ సినిమా తీయచ్చు అంటున్నారు . ఈ విషయం ప్రక్కన పెడితే హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ రజనీ పాత్రలో జీవించబోతున్నాడు.