twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చేతిలో చిప్పతో మోడీకి అవమానం.. బాహుబలి 'కట్టప్ప' అరెస్ట్ అంటూ వార్తలు!

    |

    బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రకు ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. బాహుబలి 2 పై అంతంగా అంచనాలు పెరిగాయంటే అందుకు ముఖ్య కారణం కట్టప్ప పాత్రే అని చెప్పొచ్చు. ఈ పాత్రని పోషించిన సత్యరాజ్ నటుడిగా ఎన్నో అద్భుత పాత్రలు పోషించారు. కానీ బాహుబలి చితం మాత్రం దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. సత్యరాజ్ ని ప్రస్తుతం ఎవరు చూసిన బాహుబలి కట్టప్ప అని సంభోదిస్తున్నారు. ఇదిలా సత్యరాజ్ అరెస్ట్ అయ్యారంటూ వస్తున్న వార్తలు సినీ వర్గాలని షాక్ కు గురిచేశాయి. నిజంగా సత్యరాజ్ అరెస్ట్ అయ్యారా.. ఈ వార్తలు రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

    సత్యరాజ్ అరెస్ట్ అంటూ

    సత్యరాజ్ అరెస్ట్ అంటూ

    సత్యరాజ్ తన పేస్ బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోడీ చేతిలో చిప్ప పట్టుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అది మార్ఫింగ్ చేసిన ఫోటో. భారత ప్రధానిని అవమానించే విధంగా ఆ ఫోటో ఉండడంతో పోలీసులు సత్యరాజ్ ని అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. బాహుబలి కట్టప్ప అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం మొదలైంది. కానీ ఇది వాస్తవం కాదు.

    అసలేం జరిగిందంటే

    అసలేం జరిగిందంటే

    భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తమిళనాడులోని మధురై నగరంలో పర్యటించారు. ప్రధాని పర్యటనని ఎండిఎంకె పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోడీ రాకని నిరసిస్తూ నగరం మొత్తం ఆ పార్టీ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా క్యాంపైనింగ్ నడిచింది. మోడీకి వ్యక్తిరేకంగా ఎండిఎంకె నేత సత్యరాజ్ బాలు సోషల్ మీడియాలో మోడీని అవమానించే విధంగా ఉన్నా మార్ఫింగ్ ఫోటోని పోస్ట్ చేశారు. చేతిలో చిప్ప పట్టుకుని ఉన్న ఫోటో అదే.

     పేర్లు ఒకేలా

    పేర్లు ఒకేలా

    దీనితో పోలీసులు సత్యరాజ్ బాలుని అరెస్ట్ చేయడం జరిగింది. పేర్లు ఒకే విధంగా ఉండడంతో నటుడు సత్యరాజ్ అరెస్ట్ అయ్యారనే వార్త ప్రచారం జరిగింది. సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందారు. జరిగిన వాస్తవం తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత మంది నటుడు సత్యరాజ్ రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే గడిపారని కూడా భ్రమ పడ్డారు. ఈ రోజుల్లో చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెద్దదిగా మారిపోతోంది.

     వందలాది చిత్రాల్లో

    వందలాది చిత్రాల్లో

    నటుడు సత్యరాజ్ దక్షణాది భాషల్లో వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. బాహుబలి మొదటి భాగం తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. హైపర్, మిర్చి, బాహుబలి,బ్రహ్మోత్సవం చిత్రాలు సత్యరాజ్ కు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. ప్రస్తుతం నాని జెర్సీ చిత్రంలో కూడా సత్యరాజ్ నటిస్తున్నారు.

    English summary
    False news circulating as Actor Sathyaraj Arrest over defaming Narendra Modi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X