ప్రముఖ విలన్ కన్నుమూత.. ఎన్నికల ప్రచారమే ప్రాణం తీసిందా!
కొద్ది రోజులుగా సినీ రంగంలో వరుసగా విషాదకర దుర్ఘటనలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం రోజలు వ్యవధిలోనే సినీ రంగంతో సంబంధం ఉన్న ఎంతో మంది నటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎందరో గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అరుళ్‌మణి మరణించారు. దీంతో కోలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.
దశాబ్ద కాలానికి పైగానే సినిమాల్లో నటించి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న అరుళ్‌మణి (65) గత రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ సీనియర్ నటుడు మరణించినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారని కోలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది. అరుళ్‌మణి మరణ వార్తను కొందరు ప్రముఖులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.

నటుడు అరుళ్‌మణి మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అరుళ్‌మణి మరణంపై పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అరుళ్‌మణి తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీలో కొంత కాలంగా యాక్టివ్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం చెన్నైకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. అందువల్లే అరుళ్‌మణి మరణించారని అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక.. అరుళ్‌మణి చాలా ఏళ్ల క్రితమే యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఆయన 'సింగం', 'సింగం 2', 'లింగా' చిత్రాల్లో విలన్ పాత్రలను చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇవి మాత్రమే కాదు.. 'తాండవకోనే', 'అళగి', 'అజకి', 'తేన్‌రాల్', 'అరు మజాల్ 4' వంటి మూవీల్లోనూ కనిపించి మెప్పించారు. అరుళ్‌మణి అంత్యక్రియలు శుక్రవారమే జరగనున్నాయని తెలిసింది.


Click it and Unblock the Notifications











