twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమాని మరణం తట్టుకోలేక ఏడ్చేసిన హీరో కార్తి (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    స్టార్ హీరోలంటే పడిచచ్చే అభిమానులుంటారు. ఆ హీరోకు ఏమైనా జరిగితే అల్లాడి పోతారు. అయితే హీరోలకు మాత్రం ఆ స్థాయిలో అభిమానులపై ఎమోషన్ ఉండటం చాలా అరుదు. తాజాగా తమిళనాడులో జరిగిన సంఘటన చూస్తే.... కొందరు హీరోలు సైతం తమ అభిమానులతో ఎంత ఎటాచ్మెంటుతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. తమిళ స్టార్ కార్తి అభిమాని మరణం తట్టుకోలేక బోరున ఏడ్చేశారు.

    వివరాల్లోకి వెళితే...

    వివరాల్లోకి వెళితే...

    తమిళనాడుకు చెందిన జీవన్ కుమార్ (27) తంబారం-ఇరుంపులియుర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీవన్ కుమార్ తిరువన్నామలై జిల్లా కార్తి ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

    అభిమాని మరణం తట్టుకోలేక ఏడ్చేసిన కార్తి

    అభిమాని మరణం తట్టుకోలేక ఏడ్చేసిన కార్తి

    విషయం తెలిసిన వెంటనే కార్తి జీవన్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. తను ఎంతగానో ఇష్టపడే అభిమాని విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆయన తట్టుకోలేక ఎమోషనల్ అయ్యారు.... ఏడ్చేశారు. కార్తితో పాటు అక్కడికి చేరుకున్న అభిమానుల రోదనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

     మూడు నెలల క్రితమే జీవన్ వివాహం

    మూడు నెలల క్రితమే జీవన్ వివాహం

    మూడు నెలల క్రితమే జీవన్ కుమార్ వివాహం జరిగింది. ఆ వివాహ వేడుకకు కార్తి కూడా హాజరయ్యారు. వైవాహిక జీవితం మొదలు పెట్టి కొన్ని రోజుల్లో జీవన్ కుమార్ మరణించడంతో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

    కుటుంబాన్ని ఆదుకుంటానన్న కార్తి

    కుటుంబాన్ని ఆదుకుంటానన్న కార్తి

    జీవన్ కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కార్తి సిద్ధమయ్యారు. జీవన్ కుమార్ లేని లోటు తీర్చలేనిదని, తన వంతుగా కుటుంబానికి సపోర్టుగా ఉంటానని కార్తి మాటఇచ్చారు.

    English summary
    Tamil hero Karthi broke into tears when he attended the funeral of Jeevan Kumar, his ardent fan and also the District head of Thiruvannaamalai Karthi Fans Welfare Association.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X