రజనీతో సెల్ఫీ.. ఇక ప్రశాంతంగా చనిపోయినా ఫర్వాలేదు
ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎంత పాపులారిటీ, స్టార్‌డమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీని దగ్గరగా చూడాలని, వీలైతే చేయి తాకాలని, లేదంటే ఓ ఫోటో దిగాలని కోట్లాది మంది అభిమానులు కోరుకొంటారు. అలాంటి కోట్లాది అభిమానుల్లో ఒకరైన లక్ష్మణ్‌కు సెల్ఫీ దిగే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ కుర్రాడు పరిస్థితి ఎలా ఉందో మీరే ఊహించుకోండి... వివరాల్లోకి వెళితే

రజనీనివెంటాడిన అభిమాని
మద్రాస్ ఎయిర్‌పోర్టు నుంచి ట్యుటికారిన్‌కు వెళ్లడానికి రజనీకాంత్ బయలుదేరాడు. కారులో ఎయిర్‌పోర్టుకు వస్తున్న సమయంలో లక్ష్మణ్ అనే అభిమాని చూసి వెంబడించాడు. ఆ సమయంలో అభిమానిని గమనించిన రజనీ కారును ఆపమని డ్రైవర్‌కు సూచించారు. కారు ఆగిన వెంటనే అభిమాని దగ్గరికి పిలిచి మాట్లాడారు.

అభిమానితో రజనీ సెల్ఫీ
తన అభిమాన నటుడిని చూసిన లక్ష్మణ్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సెల్ఫీ దిగుతానని రజనీకాంత్‌ను వినమ్రంగా అడిగారు. అభిమాని కోరికను మన్నించి వెంటనే రజనీ సెల్పీ దిగారు. రజనీతో సెల్ఫీ దిగి ఆనందంతో తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసుకొన్నాడు.

ఇక చనిపోయినా ఫర్వాలేదు
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సెల్పీ దిగాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోయిన ఫర్వాలేదు అని లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రజనీ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో అని వెల్లడించడానికి ఈ ఉదంతం చాలూ అని చెప్పవచ్చు.

జూన్ 7న కాలా చిత్రం
రజనీకాంత్ నటించిన కాలా చిత్రం జూన్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రాన్ని వండర్‌బార్, లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో హీరో ధనుష్ నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు హ్యుమా ఖురేషి, నానా పాటేకర్ నటించారు. కబాలి తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో సంపత్, షియాజి షిండే, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. అలాగే రూ.400 కోట్ల వ్యయంతో శంకర్ దర్శకత్వంలో రూపొందించిన 2.0 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications