సూర్య తండ్రి మళ్ళీ.. మాటి మాటికీ ఇదేం బుద్ది, ఎలా విసిరికొట్టాడో చూడండి!

Recommended Video

Fans Are Angry Over Surya's Father Shivakumar | Filmibeat Telugu

స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ మరోమారు వార్తల్లో కెక్కారు. నటుడిగా అనేక చిత్రాల్లో నటించిన శివ కుమార్ ప్రస్తుతం తన తనయులు సూర్య, కార్తీ నటన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే శివ కుమార్ ఇటీవల మాత్రం తరచుగా వివాదాలు కొనితెచ్చుకుంటూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. కొన్ని నెలల క్రితమే ఓ వివాదం కారణంగా శివకుమార్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. మళ్ళి అదే తరహా ప్రవర్తనతో శివ కుమార్ విమర్శలకు గురవుతున్నాయి. తాజాగా జరిగిన సంఘటన వివరాలు చూద్దాం!

కొన్ని నెలల క్రితమే

కొన్ని నెలల క్రితమే

కొన్ని నెలల క్రితం శివ కుమార్ అభిమాని విషయంలో దురుసుగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లిన శివకుమార్.. అక్కడ ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతడి ఫోన్ ని నేలకేసి కొట్టిన వీడియో వైరల్ అయి దుమారం రేపింది. అభిమానులతో ఇలాగేనా ప్రవర్తించేది అని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

 కొత్త ఫోన్

కొత్త ఫోన్

తన ప్రతిష్టకు డ్యామేజ్ జరుగుతుండడంతో శివ కుమార్ ఆ సంఘటనపై క్షమాపణ తెలిపాడు. అంతే కాదు ఆ అభిమానికి కొత్త ఫోన్ కూడా కొని ఇచ్చాడు. ఆ సమయంలో నా చుట్టూ వందల మంది ఉన్నారని అందువలనే అలా ప్రవర్తించానని శివకుమార్ వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పటి వరకు తాను సహనంతో వేలాదిమందికి ఫోటో గ్రాఫ్స్ ఇచ్చానని తెలిపారు. పెద్ద ఎత్తున తోపుకు గురవుతున్న సమయంలో సెల్ఫీ మంచిది కాదని అలా చేసినట్లు తెలిపారు.

విసిరికొట్టాడు

ఆ ఘటన మరువక ముందే శివకుమార్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పాత తరహాలోనే మరో అభిమాని ఫోన్ ని విసిరికొట్టాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం అదో వివాహ వేడుకలా కనిపిస్తోంది. శివ కుమార్ రాగానే ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. కానీ ఆయన అతడి ఫోన్ ని చేత్తో కొట్టడంతో అది దూరంగా పడింది. అసలు ఆ అభిమానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా శివ కుమార్ చేసిన ఈ పని నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

సూర్య, కార్తీ

సూర్య, కార్తీ

ఇక శివ కుమార్ అభిమానుల పట్ల ఇలా ప్రవర్తిస్తుంటే.. అయన తనయులు సూర్య, కార్తి మాత్రం అభిమానులంటే ఎంతో ప్రేమ చూపిస్తారు. సూర్య, కార్తీ ఎలాంటి వివాదాలు లేకుండా అభిమానులతో చేరువగా ఉంటారు. శివ కుమార్ ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. సూర్య, కార్తీకి తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. సూర్య తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X