కావేరి జల వివాద ఛాయలు తమిళ, కన్నడ పరిశ్రమ వారిని విడిచిపెట్టక మునిపే మరో గొడవ చెల రేగేటట్లు ఉంది. తాజాగా హీరో రిషి చేస్తున్న తమిళ సినిమా యూనిట్ వారిపై కన్నడ రక్షణ వేదిక సమితి అంటూ కొంతమంది కన్నడిగిలు దాడి జరిపారు. 'ఎ ఫిల్మ్ బై అరవింద్' సినిమాతో పాపులర్ అయిన రిషి తమిళుడు కావటంతో అక్కడా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో కృష్ణ దర్శకత్వంలో కీర్తి హీరోయిన్ గా En Ippadi Mayakinai అనే సినిమా చేస్తున్నాడు. స్మూత్ గా షూటింగ్ జరిగిపోతున్న సమయంలో సాంగ్ సీక్వన్స్ ప్లాన్ చేసుకున్నారు. కాని హఠాత్తుగా ఈ గుంపు వచ్చి దొరికిన వారిని రక్తాలు కారేలా చావబాది,కెమెరాలు బ్రధ్ధలు కొట్టి తమిళులకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారట. ఈ దాడిలో దర్శకుడుకి బాగా దెబ్బలు తగిలాయి. Hogenekkal త్రాగునీటి వివాదమే దీనికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పుతున్నారట. వాస్తవానికి తమకీ ఆ వివాదానికి సంభందం లేకపోయినా వారి ఆవేశానికి బలై నందుకు బాధపడుతూ కర్ణాటక డిప్యూటి కమీషనర్ పి.కె.సింగ్ కి పిర్యాదు చేసారు యూనిట్ వారు.