‘అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను’
తన తర్వాతి చిత్రం 'కొచ్చాడయాన్' అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. అదే విధంగా 3డి ఫార్మాట్లో విడుదల కాబోతోన్న 'శివాజీ 3డి' చిత్రం విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రజనీ వెల్లడించారు.
ఈ రోజు 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే 12/12/12 తేదీ కావడం, 14 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలారు. మరో వైపు తమిళనాడుతో పాటు సౌతిండియా వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కొన్ని చోట్లు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications












