»   » అభిమానం పేరుతో రజనీ ఫ్యాన్స్ అలా చేయడం కుదరదు!

అభిమానం పేరుతో రజనీ ఫ్యాన్స్ అలా చేయడం కుదరదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: అభిమానం ఉండొచ్చు...వీరాభిమానం ఉండొచ్చు... కానీ అభిమానం పేరుతో అనవసర వృధా చేయడం ఎంత వరకు సబబు? తమ అభిమాన హీరో సినిమాలు విడుదలైనపుడు అభిమానులు సంబరాలు జరుపుకోడం, పెద్ద పెద్ద బేనర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలాభిషేకాలు కూడా చేస్తుంటారు.

సౌత్‌లో ఈ రకంగా అతిగా హడావుడి చేసే వారిలో ముందుండేది రజనీకాంత్ అభిమానులే. రజనీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే....కటౌట్లకు, పోస్టర్లకు అభిషేకం పేరుతో సౌతిండియా వ్యాప్తంగా వేలాది లీటర్ల పాలు నేలపాలు చేస్తున్నారు అభిమానులు. ఇకపై అభిమానులు ఇలా పాలాభిషేకం చేయడం కుదరదేమో!

Fans milk wastage: Rajinikanth in legal trouble

రజనీకాంత్ అభిమానులు చేస్తున్న పాల వృధాపై ఒక బెంగుళూరులోని కోర్టులో ఇంజక్షన్ సూట్ దాఖలైంది. ఆయన సినిమా విడుదల సందర్భంగా పోస్టర్లను అభిషేకించడానికి వేల లీటర్ల పాలను వృథా చేస్తున్నారని, అలా చేయకుండా రజనీకాంత్‌కి, ఆయన అభిమానులకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

26న దాఖలైన ఈ కేసుపై కోర్టు రజనీకాంత్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది. మరి దీనిపై రజనీకాంత్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయమై రజనీకాంత్ పాజిటివ్ గా స్పందిస్తే బావుంటుందని పలువురు భావిస్తున్నారు. పాలాభిషేకం చేసే బదులు అవే పాలను రోగులకు, పేదల పిల్లలకు దానం చేసేలా రజనీకాంత్ అభిమానులకు సూచిస్తే బావుంటుందని అంటున్నారు.

English summary
An injunction suit has been filed against Tamil superstar Rajinikanth in which the petitioner has appealed to the court to give directives to the actor and his fans who waste thousands litres of milk each time the star’s film is set to release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X