twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీచంగా ప్రవర్తించి.. ఈ హీరో పేరు చెప్పారు.. ఇంతకీ ఎవరి ఫ్యాన్స్?

    |

    హీరోలు హీరోలు బాగానే ఉంటారు.. అభిమానులే పంతాలకు, పౌరుషాలకు పోయి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు దేశంలో ఇతర సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కాస్త ఎక్కువే. ఈ మధ్య ప్రత్యర్థి హీరోల అభిమానులకు చెడ్డపేరు తేవడానికి కొందరు పని కట్టుకని తప్పుడు పనులు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో జరిగింది. అజిత్ నటించిన విశ్వాసం తమిళంలో విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ షోలు వేశారు. అయితే ఈ షోకు అజిత్ అభిమానుల ముసుగులో బయటి వారు వచ్చి థియేటర్లో విధ్వంసానికి పాల్పడ్డట్లు సమాచారం.

    అజిత్ అభిమానుల ముసుగులో విధ్వంసం

    అజిత్ అభిమానుల ముసుగులో విధ్వంసం

    చెన్నైలోని లీడింగ్ థియేటర్లలో ఒకటైన రోహిణి సిల్వర్ స్క్రీన్స్‌లో ‘విశ్వాసం' 50 రోజులు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేశారు. షో పూర్తయిన తర్వాత కొందరు దుండగులు తాము అజిత్ అభిమానులమని చెప్పుకుంటూ థియేటర్లో విధ్వంసానికి పాల్పడ్డారు. స్క్రీన్ డ్యామేజ్ చేశారు.

    అభిమానులందరికీ చెడ్డపేరు

    అభిమానులందరికీ చెడ్డపేరు

    ఈ విషయాన్ని రోహిణి సిల్వర్ స్క్రీన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవంత్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొందరు అజిత్ అభిమానుల మని చెప్పుకుంటూ థియేటర్లో భయానకంగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ రెచ్చిపోయారు. స్క్రీన్ డ్యామేజ్ చేశారు. ఇలాంటి కొందరు వ్యక్తుల వల్ల అభిమానులందరికీ చెడ్డపేరు వస్తుంది' అని ట్వీట్ చేశారు.

    ఇకపై నో స్పెషల్ షో

    ఇకపై నో స్పెషల్ షో

    మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అభిమానుల పేరుతో కొందరు థియేటర్లో విధ్వంసం సృష్టించడం, అనుచితంగా ప్రవర్తించడం లాంటివి చేసిన నేపథ్యంలో ఇకపై రోహిణి సిల్వర్ స్క్రీన్స్‌లో స్పెషల్ షోలే వేయకూడదని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ చరణ్ వెల్లడించారు.

    విశ్వాసం

    విశ్వాసం

    అజిత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వాసం' తెలుగు వెర్షన్ ఈరోజు(మార్చి 1) నైజాం, ఆంధ్రాలో విడుదలైంది. ప్రమోషన్స్ నిర్వహించక పోవడంతో ఓపెనింగ్స్ చాలా పూర్‌గా నమోదయ్యాయి.

    English summary
    Revanth Charan, executive director of Rohini Silver Screens, shared his disappointment on Twitter. "Terribly atrocious behaviour .. Such Ill minded . COMPLETE ABUSE of full freedom given. Losing the morale of screening special shows just because of a few cheap people bringing disgrace to the entire fans. This seems deliberate and no one can stoop so low. #Viswasam. [sic]" he wrote along with a picture of damaged screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X