అభిమాన హీరోకి ఫేస్ బుక్ ఫ్యాన్స్ విగ్రహం!(ఫొటో)
చెన్నై: సోషల్ మీడియా రోజులు ఇవి. ఫేస్ బుక్ ట్విట్టర్ లతో ఎక్కువ కాలం గడుపుతున్నారు యూత్. అంతేకాదు తమ అభిమానాలు, ఆవేశాలు అక్కడే చూపిస్తున్నారు. అలాగే అక్కడవారు ఫ్యాన్స్ అశోశియేషన్స్ ని సైతం పెట్టుకుని తమ హీరోలపై అభిమానాన్ని చాటుతున్నారు.
దీనికి తోడు సినిమా హీరోలపై అభిమానాన్ని చాటుకోవడంలో తమిళనాడు అభిమానులు ముందుంటారు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లకు గుడికట్టాలన్నా.. విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా తమిళ అభిమానులే. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా విజయ్ అభిమానులు కదం తొక్కుతున్నారు.
ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'కత్తి' ప్రస్తుతం కోలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఆ చిత్రం రూ.23 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఫేస్‌బుక్‌లోని 'ఫేస్‌బుక్ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ - ఎఫ్‌వీఎఫ్‌సీ' గ్రూపు అభిమానులు ఏకంగా విజయ్‌కి ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇందుకోసం రూ.లక్ష వెచ్చించినట్లు సమాచారం. ఈ విగ్రహాన్ని ఆదివారం ఉదయం క్రోంపేటలోని ఓ థియేటర్ వద్ద అభిమానుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని క్రోంపేటలో స్థాపించనున్నారు. 'తలైవా' చిత్రంలో ఉన్న విజయ్ రూపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
'కత్తి' విషయానికి వస్తే..
విజయ్ నటించిన 'కత్తి' చిత్రం ఒకే రోజున రూ.15.50 కోట్లు వసూలు చేసి రికార్డుకెక్కింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. మొదట్లో ఈ చిత్రం విడుదలకు కొన్ని తమిళ సంఘాల నుంచి నిరసన వ్యక్తమైంది.
చిత్రం విడుదలను అడ్డుకుంటామని కొన్ని సంఘాలు ప్రకటించారు. చివరికి నిరసన కారులతో చిత్ర బృందం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించింది. దీపావళి పండుగ రోజున విడుదలైంది. తొలిరోజే 15.50 కోట్ల మొత్తం వసూలైంది.


Click it and Unblock the Notifications











