Vishal : హీరో విశాల్‌కు ఏమైంది?.. అంత దారుణంగానా?

సినీ పరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్లకైనా నాలుగు కాలాల పాటు ఆఫర్లు తెచ్చిపెట్టేది, వారిని లైమ్ లైట్‌లో ఉంచేది వారి అందం, మంచి శరీరం మాత్రమే. వీటితో ఏ ఒక్కటి మిస్ అయినా వారి కెరీర్ ఖతమైనట్లే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తమ అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన స్టార్స్ జీవితాలు ఏమయ్యాయో మన కళ్లముందు బోల్డన్నీ ఉదాహరణలు. దీనిని గుర్తించారు కాబట్టే.. చాలా మంది స్టార్స్ 70 ప్లస్‌లోనూ తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నారు.

ఇకపోతే.. హీరో విశాల్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడైన ఈ హీరో.. ప్రస్తుత తరంలో కోలీవుడ్‌ అగ్ర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చెల్లమే చిత్రంలో హీరోగా నటించిన ఆయనకు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన సందైకోడి మూవీ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విషయం ఏదైనా సరే మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం విశాల్ స్టైల్. ఈ క్రమంలో ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు కూడా.

Fans worry about Hero Vishal shivers at pre-release event of Madha Gaja Raja pre release event

అయితే తెలుగువాడైన విశాల్.. తమిళనాట జయకేతనం ఎగురవేస్తూ ఉండటం ఇండస్ట్రీలోని కొందరు తమిళులకు కంటగింపుగా మారిందని అంటుంటారు. పలుమార్లు ఆయన జోరుకు బ్రేక్ వేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం)లో చోటు చేసుకున్న అవకతవకలను ఎత్తి చూపుతూ.. విశాల్ ఆయన మనుషులు పోటీ చేసి విజయం సాధించారు.

ఆ సమయంలో విశాల్ చేసిన వాడి వేడి విమర్శలతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తట్టుకోలేకపోయింది. ఈ పరిణామాలతో విశాల్‌ను కౌన్సిల్ నుంచి కూడా బహిష్కరించింది. అయినప్పటికీ తట్టుకుని నిలబడిన విశాల్ 2017లో జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా విజయం సాధించి షాకిచ్చారు. కానీ విశాల్‌ను పలువురు కోలీవుడ్ సినీ పెద్దలు టార్గెట్ చేస్తూనే ఉన్నారన్న అపవాదు ఉంది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు.

ప్రస్తుతం విశాల్ నటించిన మదగజ రాజ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోయి దాదాపు 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన విశాల్‌ను చూసి అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. సరిగా నడవలేక, మాట్లాడలేక వణుకుతున్న చేతులతోనే అతి కష్టం మీద మాట్లాడేందుకు ప్రయత్నించిన విశాల్ కనీసం మైక్ కూడా పట్టుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అసలు విశాల్‌కు ఏమైందంటూ చర్చ జరుగుతోంది.

అయితే కోలీవుడ్ మీడియా ప్రకారం.. విశాల్ పలుమార్లు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన నరాలు బాగా దెబ్బతినడంతో దాని తాలుకా రియాక్షన్ కారణంగానే విశాల్ అనారోగ్యం బారినపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కండీషన్‌లోనూ తన సినిమా కోసం అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విశాల్ నిబద్ధతను పలువురు మెచ్చుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X