పబ్లిక్ గా తారాస్థాయికి చేరిన ప్రభు-నయనల అతర్యుద్దం...!
టాప్ కొరియోగ్రాఫర్ 'ప్రభుదేవా" దర్శకుడిగా అవతారమెత్తి, తమిళ, తెలుగు, హిందీలో కొన్ని సక్సెస్ సినిమాలు అందించాడు. కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు తన తోటి డాన్సర్ తో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత నయనతార ప్రేమ మోజులో పడి, తన భార్య 'రామ్ లత్" కు కొన్ని కోట్లు ఇచ్చి వదిలించుకున్నాడు. అయితే కోర్టు నుండి విడాకుల మంజూరి పత్రం వచ్చిన వెంటనే నయనతార పెళ్ళి చేసుకుంటానని ఈ మధ్యనే తెలిపాడు.
కాని ఫిలింనగర్ న్యూస్ ప్రకారం ప్రభుదేవా వ్యవహారంపై భారీ ఎత్తున పుకార్లు వచ్చాయి. ప్రభుదేవా రూటు మార్చాడు. హన్సిక ప్రభుదేవా కలిసి రాసుకు పూసుకు తిరుగుతున్నారనీ, వీరిద్దరూ కలిసి అనేక ఫంక్షన్లకు వెళుతున్నారని, బహుశ నయనతారను వదిలి హన్సికకు తాళికట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడని పుకార్లు..
నయనతారతో ప్రభుదేవా తిరిగి తిరిగి భోరుకొట్టినందునే, హన్సిక వెంట తిరుగుతున్నాడని ఫిలింనగర్ లో న్యూస్ ఈ విషయం చిన్నగా 'నయనతార" చెవిలో పడటంతో, ప్రభుదేవా మీద పట్టలేనంత కోపంగా ఉందట. మరో పుకారు ఏంటంటే..హన్సిక విషయంపై నయనతార, ప్రభుదేవా తీవ్రంగా పోట్లాడుకున్నారని, ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి వచ్చాయని కూడా ఫిలిం ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు...


Click it and Unblock the Notifications











