బొమ్మరిల్లు రేస్‌లో భాగ్యరాజా
తెలుగుచిత్ర సీమలో ఒక సినిమా మొదటి రోజే హిట్ టాక్ రావడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అరుదు. సినిమా చేయడం, టీవీల ముందు కూర్చుని సినిమా ప్రమోషన్ కోసం పాట్లు పడటం అలవాటైపోయిన తరుణంలో స్ట్రయిట్ హిట్ కొట్టిన క్రెడిట్ పోకిరి చిత్రం తర్వాత దిల్ రాజు, భాస్కర్ టీమ్‌కే దక్కింది.
పోకిరి చిత్రం ఆల్రెడీ తమిళంలో రీమేక్ అయిపోతోంది. విజయ హీరోగా ప్రభుదేవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా బొమ్మరిల్లు చిత్రం కూడా విజయం సాధించడంతో తమిళ ప్రొడ్యూసర్లు ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం పోటీలు పడుతున్నారు. వారిలో ప్రముఖులు ఎడిటర్ మోహన్, దర్శకుడు భాగ్యరాజా ఇద్దరూ ఉన్నారు.
ఎడిటర్ మోహన్ కుమారులిద్దరూ తమిళంలో దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు రవికి రీమేక్-రవిగా నిక్‌నేమ్ కూడా ఉంది. అతను తీసిన స్ట్రయిట్ చిత్రాలు ఫ్లాప్ కాగా తెలుగు రీమేక్‌లు హిట్ అయ్యాయి. వాటిలో తెలుగులో హిట్ అయిన జయం, అమ్మా నాన్నా, ఓ తమిళమ్మాయి వంటివి ఉన్నాయి.
మరోవైపు ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా కూడా బొమ్మరిల్లు రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఆయన తన కూతురు శరణ్యను హీరోయిన్‌గా రంగప్రవేశం చేయించారు. పారిజాతం చిత్రం తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో బొమ్మరిల్లు చిత్రంలో హాసిని క్యారెక్టర్ తన కూతురుకు సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నారు.
ఇద్దరు తండ్రులు తమ పిల్లల గురించి బొమ్మరిల్లు రైట్స్ కోసం పోటీ పడుతుండటంతో సినీవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తుతోంది.


Click it and Unblock the Notifications











