పెద్ద హీరోల సినిమాలపై నిర్మాతల మండలి నిబంధన
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) రీసెంట్ గా ఓ నిర్ణయం తీసుకుని పెద్ద హీరోలకు షాక్ ఇచ్చింది. వారి సినిమాలు ఎప్పుడు అప్పుడు రిలీజ్ చేసుకోవటానకి వీల్లేదని,కేవలం పండుగ రోజుల్లోనే విడుదల చెయ్యాలని నిబంధన పెట్టింది. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వారు ఓ సర్కుల్ లో తెలియచేసారు. పెద్ద సినిమాలను సంక్రాంతి,నూతన సంవత్సరం,మే డే,ఇండిపెండెన్స్ డే, దీపావళి రోజుల్లోనే విడుదల చెయ్యాలని చెప్పారు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో చిన్న చిత్రాలకు అస్సలు థియేటర్స్ దొరకటం లేదని, అందువల్ల వారు ఆర్ధికంగా చాలా చితికిపోతున్నారని, మంచి సినిమాలు కూడా కిల్ అయ్యిపోతున్నాయని అందుకే కఠినమైనా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ఈ నిర్ణయంతో ధనుష్ 3 చిత్రం,కార్తీ శకునీ చిత్రం రెండూ పిబ్రవరిలో విడుదల కావాల్సినవి వాయిదాపడుతున్నాయి. ఏప్రియర్ 13 తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా వారి చిత్రాలను విడుదల చేసుకోమని ఛాంబర్ ఆదేశించింది. అంతేగాక అజిత్ భిళ్లా 2 చిత్రాన్ని మే 1 వ తేదీన విడుదల చెయ్యాలని చెప్పింది. దాంతో చిన్న చిత్రాలు నిర్మాతలంతా హర్షద్వానాలు చేస్తున్నారు. పెద్ద హీరోలు మాత్రం తమలో తమకే పోటి వస్తుందని, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్ధితి అని వాపోతున్నారు. ఒకే రోజు అందరూ పెద్ద హీరోలు విడుదల పెట్టుకుంటే ధియోటర్స్ ఎక్కడనుంచి తెచ్చుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ నిబంధన తెలుగులో కూడా అమలు పరిస్దే బావుంటుందని ఇక్కడ చిన్న నిర్మాతలు ఛాంబర్ అడిగే యోచనలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











