Film Critic Kaushik LM కన్నుమూత.. గుండెపోటుతో ఆకస్మిక మృతి
కోలివుడ్‌తోపాటు దక్షిణాదిలో ప్రముఖ రివ్యూవర్, మూవీ ట్రాకర్, ట్రేడ్ అనలిస్ట్ ఎల్ఎమ్ కౌశిక్ ఆకస్మికంగా మరణించాడు. ఆయన మృతి తమిళ సినీ వర్గాలు దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఆయన గుండెపోటుతో ఆగస్టు 15వ తేదీన మధ్యాహ్నం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన వయస్సు 35 సంవత్సరాలు. ఆయన మృతిపై కీర్తీ సురేష్, వెంకట్ ప్రభు, తమన్ ప్రముఖ సినీ తారలందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణంతో స్నేహితులు సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.

కౌశిక్ ఎల్ఎం విషయానికి వస్తే.. సినిమా రంగంలో పలు విషయాలపై అవగాహనతోపాటు ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, యూట్యూబ్ వీడియో జాకీ, బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమాల రివ్యూలు, క్రీడల్లో క్రికెట్, టెన్నిస్ విషయాలపై మంచి అప్‌డేట్ ఇస్తూ విశేషంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకొన్నారు.
కౌశిక్ మరణ వార్త విన్నవెంటనే వెంకట్ ప్రభు ట్వీట్ చేస్తూ.. ఓ మైగాడ్.. నమ్మలేకపోతున్నాను. కొద్ది రోజుల క్రితమే మాట్లాడాను. జీవితంలో ఊహించని సంఘటన. కౌశిక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి నా ప్రగాఢ సంతాపం అని తెలిపారు.
రాఘవ లారెన్స్ ట్వీట్ చేస్తూ.. షాకింగ్ వార్త. ఆయన మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆయన ఫ్యామిలీ, స్నేహితులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బ్రదర్ మీరు లేరనే ఈ వార్తను నమ్మలేకపోతున్నాను అని సంతాపం ప్రకటించారు.
కర్తీ సురేష్ ట్వీట్ చేస్తూ.. ఈ వార్త వినగానే నా నోటి వెంట మాటలు రావడం లేదు. నమ్మలేకపోతున్నాను. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం అని సంతాపం తెలిపారు.
ఇంకా అదితి రావు హైదరీ, సూర్య, విజయ్ దేవరకొండ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.


Click it and Unblock the Notifications











