భార్యని ముక్కలుగా నరికిచంపిన దర్శకుడు.. ఆపై ఏం చేశాడంటే, దారుణానికి కారణం ఇదే!

మానవ సంబంధాలు దిగజారుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు అనుమానంతో తన భార్యని అతి కిరాతకంగా చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు సంబంధించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాదల్ ఇళవసం అనే చిత్రంతో దర్శకుడిగా మారిన బాలకృష్ణన్ తన భార్య సంధ్యని హత్య చేశాడు. ఈ కేసుని పోలీసులు ఎట్టకేలకు ఛేదించాడు. బాలకృష్ణన్ వయసు 51 ఏళ్ళు. అతని భార్య సంధ్య వయసు 35 ఏళ్ళు. వీరిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. అసలు ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు చూద్దాం!

రాజకీయ నాయకుడిగా

రాజకీయ నాయకుడిగా

బాలకృష్ణన్ గతంలో రాజకీయ నాయకుడిగా ఉండి విజయం సాధించలేకపోయాడు. దీనితో సినిమాలపై ఆసక్తితో 2010 తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. బాలకృష్ణన్ దర్శత్వం వహించిన తొలి చిత్రం కాదల్ ఇళవసం. ఈ చిత్రం 2012లో విడుదలైన తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత బాలకృష్ణన్ మరో చిత్రాన్ని తెరక్కించలేదు.

 భార్య కోరిన కోరిక

భార్య కోరిన కోరిక

బాలకృష్ణన్ దర్శకుడిగా మారిన తర్వాత అతడి భార్య సంధ్య తనకు నటించాలని ఉందనే కోరికని బయట పెట్టింది. తప్పనిసరిగా నటిని చేస్తానని బాలకృష్ణన్ ఆమెకు హామీ ఇచ్చాడు. కానీ రోజులు గడుస్తున్నా సంధ్య కోరిక మాత్రం తీరడం లేదు. దీనితో బాలకృష్ణన్ పై సంధ్య ఒత్తిడి పెంచింది. తనకు పరిచయం ఉన్న దర్శక నిర్మాతలతో నీ గురించి చెబుతానని, వాళ్ళ చిత్రాల్లో అవకాశాలు ఇస్తారని బాలకృష్ణన్ చెబుతుంది వాడు.

వాళ్ళతో సన్నిహితంగా

వాళ్ళతో సన్నిహితంగా

భర్త తన కోరికని పట్టించుకోక పోవడంతో సంధ్యని సినిమాల్లో నటించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. తన భర్తకు పరిచయం ఉన్న నిర్మాతలని, దర్శకులని సాధ్య కలిసేందుకు వెళ్ళేది. ఈ క్రమంలో బాలకృష్ణన్ కు ఆమెపై అనుమానం పెరిగింది. ఆమె దర్శకులతో, నిర్మాతలతో చనువుగా మెలగడం బాలకృష్ణన్ కు నచ్చలేదు. దీనితో పలు సందర్భాల్లో ఆమెని హెచ్చరించాడు. అయినా సంధ్య వైఖరిలో మార్పు రాలేదు. దీనితో బాలకృష్ణన్ లో రోజు రోజులు సంధ్యపై ఆక్రోశం పెరిగేది.

అనుమానం తీవ్రస్థాయికి

అనుమానం తీవ్రస్థాయికి

తన భార్య ఇండస్ట్రీలోని కొందరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని బాలకృష్ణన్ లో బలమైన అనుమానం కలిగింది. ఈ విషయం గురించి నేరుగా ఆమెని ప్రశ్నించగా గత నెల 19న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కోపంతో రగిలిపోయిన బాలకృష్ణన్ ఆమెని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఆ తర్వాత ఆమెని ముక్కలుగా నరికి చెత్త కుప్పలో పడేశాడు.

టాటూ ఆధారంతో

టాటూ ఆధారంతో

చెత్తకుప్పలని మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డుకు చేర్చారు. జనవరి 21న కొందరి వ్యక్తులకు ఆమె చేయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డంపింగ్ యార్డుని మరింత శోధించగా మిగిలిన భాగాలు కూడా బయటపడ్డాయి. ముఖం, మొండెం ముక్కలుగా ఉండడంతో గుర్తుపట్టలేకపోయారు. చివరకు పోలికలు ఆమె చేతికి ఉన్న టాటూ ఆధారంగా దొరికింది. చాలా రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎట్టకేలకు ఆమె బాలకృష్ణన్ సతీమణి సంధ్య అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

వేధించే వాడు

వేధించే వాడు

దీనితో అతడిని అరెస్టు చేసి విచారించగా హత్య తానే చేశానని జరిగినదంతా పోలీసులకు వివరించాడు. బాలకృష్ణన్ సంధ్యని అక్రమ సంబంధం పేరుతో తరచుగా వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడు సినిమా చేసేందుకు కూడా తామే ఆర్థిక సాయం చేశామని సంధ్య కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X