రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నటి.. 2013 నుంచి ఆ దర్శకుడితో ప్రేమలో!

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవరాలకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని జంటలు మాత్రమే పెళ్ళిపీటల వరకు వెళుతుంటారు. చాలా మంది నటీమణులు హీరోలతో, దర్శకులతో రిలేషన్ షిప్ కొనసాగిస్తుంటారు. ఓ తమిళ నటి మంగళవారం రోజు యువ దర్శకుడిని రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్న వార్త ఆసక్తిగా మారింది. పెళ్లి పేరుతో పెద్ద హడావిడి చేయకుండా ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. యువ దర్శకుడు నవీన్, నటి సింధు రెడ్డి వివాహం మంగళవారం రోజు జరిగింది.

రిజిస్టర్ మ్యారేజ్

రిజిస్టర్ మ్యారేజ్

పెళ్లి పేరుతో హంగామా సృష్టించడం ఎందుకని భావించారో ఏమో కానీ నవీన్, సింధు జంట సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్న ఫోటోని నవీన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అధికారికంగా తాను, సింధు భార్య భర్తలం అయినట్లు నవీన్ ప్రకటించాడు. దీనితో నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

దర్శకుడిగా రాణిస్తూ

నవీన్ దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. నవీన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం మోదర్ కోడం. ఈ చిత్రం 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం నవీన్ పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. నూతన నటీనటులతో తెరకెక్కించిన మోదర్ కోడం చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రానికి నిర్మాత కూడా నవీనే కావడం విశేషం.

2013 నుంచి ప్రేమలో

మోదర్ కోడం చిత్రంలో సింధు రెడ్డి కూడా ఓ నటిగా నటించింది. ఆ చిత్రం నుంచే వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. 2013 నుంచే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఎట్టకేలకు పెళ్లిచేసుకోవాలనే ఆలోచన రావడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇన్నేళ్ళుగా వీరి మధ్య సైలెంట్ గా ఎఫైర్ సాగింది. నవీన్ తన ట్వీట్ లో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను,సింధు మతాలకు, కులాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం అని పేర్కొన్నాడు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఏ కులంపై కానీ, మతంపై కానీ మాకు వ్యతిరేకత లేదు. తాము నమ్మేది మానవత్వాన్ని మాత్రమే అని నవీన్ పేర్కొన్నాడు.

 తదుపరి చిత్రాలు

తదుపరి చిత్రాలు

ఇదిలా ఉండగా నవీన్ ప్రస్తుతం కోలంజి అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో సముద్రఖని, సంఘవి లాంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అగ్ని సిరాగుగల్ అనే మరో చిత్రానికి నవీన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ తన రచనలకుగాను పలు గాను పలు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X