తన సినిమా పెద్ద హిట్ కోసం 15 నుంచి 20 గంటలు కష్టపడుతున్న అగ్ర హీరో...!?
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'విశ్వరూపం" చిత్రం తెరకెక్కాల్సివుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆరంభమయ్యిందిగానీ...సెల్వరాఘవన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. కమల్ హాసన్ తనే దర్శకత్వం బాధ్యతలు చేపట్టాడు. దీని గురించి కమల్ హాసన్ మాట్టాడుతూ...'నాతో సినిమా చేయాలనుకునే దర్శకుడు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం నా టైమ్ వేస్ట్ చేయకూడదని.
'విశ్వరూపం" కోసం సోనాక్షి సిన్హా కేటాయించిన డేట్స్ అయిపోయాయి. నేను కేటాయించిన డేట్స్ కూడా సగం అయిపోయాయి. అయినా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. దాంతో నేను స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం రూపొందనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని డబ్ చేస్తాము" అని చెప్పారు..
కాగా అగ్ర హీరో కమల్ హాసన్ ఎంత పనిమంతుడో అందరికీ తెలుసు. కమల్ హాసన్ ఏదైన సినిమా చేస్తున్నాడంటే అది పూర్తయ్యేవరకు తన ఏకాగ్రత మొత్తం ఆ సినిమా పైనే ఉంటుంది. ప్రస్తుతం కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ప్రస్తుతం 57 సంవత్సరాల వయస్సు ఉన్న కమల్ హాసన్ ఈ సినిమా కోసం 15 నుంచి 20 గంటలు కష్టపడుతున్నాడట. విశ్వరూపం సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కమల్ హాసన్ ఈ సినిమాని ఒక పెద్ద హిట్ చేసేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాడు.


Click it and Unblock the Notifications











