రజనీకాంత్ తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి తీసుకున్న 'కూలీ' టీం .
సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన సినిమా షూటింగ్ స్పాట్ కు సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే టీమ్ మొత్తం అప్రమత్తమై అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఇంతకీ ఏ మూవీ షూటింగ్ జరుగుతోంది? మీరు కూడా ఓ లూక్కేయండి.
వివరాల్లోకెళ్లే.. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ అనే సినిమాలో నటిస్తున్నారు. సెన్సెషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా రూపుదిద్దుకుంటోంది. గత పదిరోజులుగా ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నం పోర్టు ఏరియాలో జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ స్పాట్ కు సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అంటే.. శనివారం మధ్యాహ్న సమయంలో విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కంటైనర్ టెర్మినల్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అప్రమత్తమైన కార్మికులు, సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్ సిబ్బంది అక్కడకు చేరుకున్న మంటలను నియంత్రించారు.

చైనా నుంచి వచ్చిన ఓ కంటైనర్‌లో మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు సమాచారం. ఈ కంటైనర్‌లో లిథియం బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కంటైనర్ ఆగస్ట్ 28వ తేదీన చైనా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ కంటైనర్ కోల్‌కతాకు వెళ్లాల్సి ఉందని తెలిసింది. దీంతో ఆ కంటైనర్ ను ట్రాలర్‌పై లోడ్ చేస్తుండగా.. ఈ ప్రమాదం చేసుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ నష్టం జరగకుండా నివారించగలిగారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతున్నట్లు తెలిసింది.
ఇక ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కూలీ'సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. గత పదిరోజులుగా విశాఖ పోర్టు ఏరియాలో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదం గురించి తెలియగానే మూవీ యూనిట్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ మూవీలో కింగ్ నాగార్జున 'సైమన్' అనే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి నాగార్జున లుక్ విడుదలైంది. ఈ లుక్ కూ భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీలో శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











