twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం.. నాజర్, విశాల్ రియాక్షన్ ఏంటి?

    |

    తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం ఉన్న భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్యలయానికి చెందిన ఫర్నీచర్, ఇతర సామాగ్రీతో పాటు కొన్ని విలువైన పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ, అత్యంత ముఖ్యమైన స్టేషనరీ కాలిపోయినట్లు సమాచారం.

    ఇదిలా ఉండగా, నడిగర్ సంఘానికి కొత్త భవనం కట్టించేందుకు అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంత మంది సినీ ప్రముఖుల నుంచి విరాళాలు సైతం సేకరించారు. అలాగే, ఈ సంఘానికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా తరచూ వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నిజంగా ఇది ప్రమాదమేనా? లేకపోతే ఎవరైనా కావాలని ఇలా చేశారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    Fire Accident in Nadigar Sangam Office

    ఇదిలా ఉండగా, దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘాన్ని 1952లో ఎంజీ రామచంద్రన్, ఎన్ఎస్ కృష్ణన్, కే సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. అప్పట్లో మన తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా దీని పరిధిలోనే ఉండేది. కాలక్రమేనా మన పరిశ్రమ దాని నుంచి వేరైపోయింది. ఇక, నడిగర్ సంఘానికి పరిమిత కాలానికి ఎన్నికలు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాజర్ ప్యానెల్ విజయం సాధించింది. సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పడటంతో ఎన్నికలు వేడిని పుట్టించాయి. ఈ ఎన్నికల్లో హీరో విశాల్ కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

    English summary
    The Nadigar Sangam, officially known as the South Indian Artistes' Association, is a union for film, television, and stage actors in the Indian state of Tamil Nadu, based in Chennai. Mr.Navarasam GKS Formed in 1952, the group has a charitable trust fund to provide pensions to retired actors, voice support for actors caught in controversy, and have collectively protested socio-political issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X