కార్తీ, కాజల్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్
ఈ చిత్రంలో ప్రేమ, హాస్యం కలగలిపి కార్తీ నటించనున్నాడు. సాధారణ మాటల్లో దాగున్న హాస్యాన్ని వెతికి మరీ.. తెరపై వెదజల్లి చిరునవ్వుల పంటను పండించడంలో దర్శకుడు రాజేష్ సిద్ధహస్తుడు. 'ఎస్‌ఎంఎస్', 'బాస్ ఎనగర బాస్కరన్', 'ఓకే ఓకే' వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ మూడు చిత్రాల్లోనూ ఒకే శైలి హాస్యం ఉన్నా.. భిన్నమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇప్పుడీ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నాడు.
చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ... నా సినిమా వన్‌లైన్ కథేనండి. ఈగో ప్రేమికుడు, పొగరుబోతు ప్రియురాలు.. చివరకు ఎలా కలసిశారన్నదే 'ఎస్‌ఎంఎస్'. ఏమాత్రం బాధ్యత లేని కుర్రాడు ఇంటిని చక్కబెట్టే వదిన వచ్చిన తర్వాత ఎలా మారాడన్నదే 'బాస్', పాండిచ్చేరిలో జరుగుతున్న ప్రియురాలి పెళ్లిని ఓ యువకుడు తన స్నేహితుడితో వెళ్లి ఆపుతాడా.. లేదా.. అన్నదే 'ఓకే ఓకే'. ఈ వన్‌లైన్ కథకు సాధారణ హాస్యాన్ని జత చేస్తాం అంతే.
ఇక 'ఆల్‌ఇన్‌ఆల్ అళగురాజా' గురించి చెప్పాలంటే.. పట్టణంలో పెరిగే ఓ యువకుడికి తన తల్లిదండ్రులే దైవాలు. ఈ అంశంతో హాస్యం, ప్రేమ, సెంటిమెంట్ కలగలిపి సినిమాగా తెరకెక్కుతోంది. ఓ తిరునాళ్లకు వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది ఈ చిత్రాన్ని చూసొచ్చిన ప్రేక్షకుడికి అన్నారు.
అలాగే హాస్యం మాత్రమే నా స్క్రిప్టు కి ప్రాణం. కానీ గత చిత్రాల్లో లేని సెంటిమెంట్‌ను ఈ సినిమాలో కొత్తగా చేర్చా. అంతేకాదు.. మూడు సినిమాల్లో మాదిరిగా సంతానానికి పంచ్‌లు ఇవ్వలేదు. బాడీలాంగ్వేజ్‌తోనే నటించమని చెప్పేశా. ఈ సినిమా కోసం సంతానం హోంవర్క్ చేశాడు. స్పాట్‌లో సింగిల్ షాట్‌లోనూ కానిచ్చేస్తున్నాడు. ఆయన హిట్‌రేట్ పెరిగేకొద్దీ నటన కూడా అలానే ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications












