ఇదిగోండి..ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ (ఫొటో)
హైదరాబాద్ : రోబో సినిమాతో పెను సంచలనాలనే నమోదు చేసిన ఈ దర్శకుడి నుంచి వస్తున్న తాజా చిత్రం ఐ (తెలుగులో మనోహరుడు) మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు దర్శక,నిర్మాతలు. 'ఐ' కి ముందు 'ఐ' కి తర్వాత చరిత్రను తవ్వుకోవాల్సిందేనని కాన్ఫిడెంటుగా చెబుతున్నారు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్.
నిర్మాత మాట్లాడుతూ... ఈ సినిమా కోసం దాదాపు 180కోట్ల బడ్జెట్ ఖర్చు చేశాను. చైనాలో 40రోజుల పాటు తెరకెక్కించిన సైకిల్ ఫైట్ హైలైట్. మూడెకరాల్లో వేసిన భారీసెట్‌లో 40రోజుల సమయాన్ని వెచ్చించి తీసిన భారీ సాంగ్ అసాధారణంగా ఉంటుంది. నీటిపై నడిచి వెళ్లే హీరోని తెరపై చూస్తే వింత అనిపిస్తుంది. చైనా నేపథ్యంలో సాగే కథాంశం కావడంతో ఏకంగా 15 వేల థియేటర్లలో అక్కడ రిలీజవుతుందిట. ఇండియాలో దాదాపు 4వేల థియేటర్లలో రిలీజ్ చేయనున్నామని తెలిపారు.

దాదాపు 285రోజుల పాటు ఈ సినిమాని తెరకెక్కించారు. శంకర్‌ని భారతీయ జేమ్స్ కామెరూన్ అని ప్రశంసలు అందుకోవడం షూరూ! యాక్షన్ సినిమా అనో, లవ్ సినిమా అనో, థ్రిల్లర్ సినిమా అనో చెప్పలేమని రవిచంద్రన్ తెలిపారు. సెప్టెంబర్ 15న ఆడియో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ఆడియో వేడుకకు హాలీవుడ్ స్టార్ జాకీచాన్‌ని రప్పిస్తున్నారు. తమిళ ఆడియోకి ఆర్నాల్డ్ స్వ్కాజ్‌నెగ్గర్‌ని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది. రెహమాన్ రీరికార్డింగ్ చేస్తున్నారు.
త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని అక్టోబర్‌లో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం. సురేష్‌గోపీ, ఉపేన్ పటేల్, సంతానం, మోహన్ కపూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, ఛాయాగ్రహణం:పీసీ శ్రీరామ్, ఎడిటింగ్:ఆంథోని.


Click it and Unblock the Notifications











