స్టార్ హీరోని నిలదీసిన మహిళలు, అదుపు తప్పిన పరిస్థితి.. వైరల్ అవుతున్న వీడియో!

ఇటీవల తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి సెలెబ్రిటీలంతా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. స్టార్ హీరో అజిత్ కు తమిళనాడులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు అతడి వాహనాల వెంటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అజిత్ తన సతీమణి షాలినితో కలసి తిరువాన్మయూర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివాదంగా మారుతోంది.

సతీమణితో కలసి

సతీమణితో కలసి

అజిత్ తో పాటు ఆయన భార్య షాలిని తిరువాన్మయూర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజిత్ ని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారింది. అజిత్ క్యూలో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనితో అజిత్ పై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

నిలదీసిన మహిళలు

నిలదీసిన మహిళలు

అజిత్ పోలింగ్ బూత్ కు వచ్చే సమయానికి అక్కడ భారీగా క్యూ ఉంది. క్యూలో నిలబడకుండా అజిత్ తన సతీమణితో కలసి నేరుగా ఓటు వేయడానికి వెళుతుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు మహిళలు అజిత్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అజిత్ అని ఇద్దరు మహిళలు తిడుతున్న వీడియో హాట్ టాపిక్ గా మారుతోంది. అజిత్ అని అడ్డుకునేందుకు ప్రయత్నించి సదరు మహిళలని పోలీసులు పక్కకు నెట్టేశారు.

పోలిసుల సలహాతోనే

పోలిసుల సలహాతోనే

అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ మొదట క్యూలో నిలబడేందుకు ఆసక్తి చూపాడట. కానీ అప్పటికే అభిమానులు పెద్దఎత్తున చేరుకోవడంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇలాంటి సమయంలో క్యూలో నిలబడడం మంచిది కాదని.. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పడంతో అజిత్ నేరుగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వారంతా క్యూలోనే

సూపర్ స్టార్ రజనీకాంత్, ఇళయదళపతి విజయ్, లోక నాయకుడు కమల్ హాసన్, శృతి హాసన్, సూర్య, జ్యోతిక, కార్తీ లాంటి సెలెబ్రిటీలంతా క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పోల్చుతూ అజిత్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X