సౌత్ హీరోతో త్రిప్తి దిమ్రి రొమాన్స్? ఎవరితోనో తెలుసా?

సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఎన్నో ఏళ్ళు నుంచి సినిమాలో ఉన్నప్పటికీ కొంతమందికి వచ్చే బ్రేక్ తాలుకా రీసౌండ్ ఓ రేంజ్ లో వినిపిస్తుంది. కాగా అప్పటివరకు ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు కానీ లైఫ్ చేంజ్ చేసేయడానికి కేవలం ఒక్క సినిమా చాలు.

అలాంటి గేమ్ ఛేంజింగ్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. మరి ఇలా ఆ ఒక్క సినిమా అందుకుని ఓవర్ నైట్ లో ఇండియా వైడ్ గా స్టార్ అయ్యిన బాలీవుడ్ బ్యూటీ ఎవరన్నా ఉన్నారు అంటే అది హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అని చెప్పాల్సిందే.

for the first time tripti dimri to romance with this south star

కాగా త్రిప్తి దిమ్రి బాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ (ఏ రేటెడ్ సినిమాల్లో) అయినటువంటి ఆనిమల్ సినిమాలో జోయాగా కనిపించి అందరికి షాకిచ్చింది. తన బోల్డ్ షోతో ఒక్కసారిగా అందరికీ క్రష్ గా కూడా మారిపోయింది. కాగా ఇక్కడ నుంచి త్రిప్తి దిమ్రి ఇండియా వైడ్ గా భారీ ఫేమ్ ని సొంతం చేసుకొని బాలీవుడ్ సినిమా దగ్గర అయితే హాట్ కేక్ లా మారిపోయింది.

దీనితో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ నిమిత్తం త్రిప్తి భారీ రెమ్యునరేషన్ లు కూడా అందుకుంది. అయినప్పటికీ ఈమెతో సినిమాలు చేసేందుకు నార్త్ నుంచే కాకుండా సౌత్ నుంచి కూడా నిర్మాతలు ఎగబడ్డారు కానీ ఆమె ఇప్పటికీ హిందీ సినిమాలోనే వర్క్ చేస్తుంది.

మరి కేవలం నార్త్ హీరోస్ తోనే కనిపిస్తుందా సౌత్ హీరోస్ తో కనిపించదా అనే ప్రశ్నకి ఇపుడు సమాధానం వినిపిస్తుంది. కాగా ఈ హాట్ బ్యూటీ మన సౌత్ లో ఓ పేరున్న స్టార్ హీరో సరసన రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయ్యినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆ హీరో మరెవరో కూడా కాదు తెలుగు ఆడియెన్స్ కి తమిళ ఆడియెన్స్ కి కూడా బాగా పరిచయం ఉన్న స్టార్ హీరో ధనుష్ తో అట.

for the first time tripti dimri to romance with this south star

కాగా ధనుష్ ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా వర్క్ చేసాడు. అలా లేటెస్ట్ గా హిందీలో మరో సినిమా చేస్తుండగా ఈ సినిమాలోనే త్రిప్తి దిమ్రి కూడా నటిస్తుందని తెలుస్తుంది. కాగా ధనుష్ నటిస్తున్న ఈ సినిమానే "తేరే ఇష్క్ మెయిన్" కాగా ఈ సినిమాలో ధనుష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.

అలాగే ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ కృతి సనన్ కూడా కనిపించనుంది. ఇలా ధనుష్ సరసన ఈ ఇద్దరు కనిపించనున్నారని చెప్పవచ్చు. కృతి సనన్ ఇప్పుడు వరకు చాలా మంది సౌత్ స్టార్స్ అందులోని మన తెలుగు హీరోస్ సరసన కనిపించింది.

ప్రభాస్ తో ఆదిపురుష్, సూపర్ స్టార్ మహేష్ తో 1 నేనొక్కడినే అలాగే అక్కినేని నాగ చైతన్య సరసన దోచేయ్ సినిమాల్లో కృతి కనిపించింది. కానీ ఒక సౌత్ హీరోతో మాత్రం త్రిప్తి దిమ్రి ఇదే తొలి సారి అని చెప్పాలి. అయితే ఇది కూడా హిందీ సినిమానే కాగా కంప్లీట్ గా సౌత్ సినిమా ఈ అమ్మడు ఎప్పుడు చేస్తుందో కాలమే నిర్ణయించాలి మరి.

More from Filmibeat

Read more about: tripti dimri dhanush kriti sanon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X