twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ డైరెక్టర్‌కు వ్యతిరేకంగా లైట్ మెన్ ధర్నా.. రెండు కాళ్ళు పనిచేయని స్థితిలో!

    |

    మణిరత్నం చిత్రాలలో కళాత్మకత ఉట్టిపడుతుంది. ఆయన దర్శత్వంలో వచ్చిన చాలా చిత్రాలు క్లాసికల్స్ అనిపించుకున్నాయి. బొంబాయి, రోజా, సఖి వంటి చిత్రాలని మణిరత్నం ప్రతిభకు మచ్చుతునకలు. కాగా ఇటీవల మణిరత్నంకు సరైన విజయాలు లేవు. ప్రస్తుతం మణిరత్నం చెక్క చివంత వానం చిత్రాన్ని తెరకెక్కిసున్నారు. ఎప్పుడూ ఎలాంటి వివాదాల్లో మణిరత్నం పేరు వినిపించలేదు. తాజగా మణిరత్నం సినిమాలకు లైట్ మాన్ గా పనిచేసిన వ్యక్తి రోడ్డుకెక్కాడు. ఈ విషయం సంచలనంగా మారింది.

     పదేళ్ల క్రితం

    పదేళ్ల క్రితం

    మణిమారన్ అనే లైట్ మాన్ సోమవారం పోలీస కమిషనర్ ని కలసి మణిరత్నంకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు. తాను పదేళ్ల క్రితం మణిరత్నం తెరెకెక్కించిన అభిషేక్, ఐశ్వర్యరాయ్ చిత్రం గురుకి లైట్ మాన్ గా పనిచేసినట్లు మణిమారన్ తెలిపాడు. ఈ చిత్ర షూటింగ్ పెరంబూరులో జరుగుతున్న సమయంలో విషజ్వరంతో తీవ్ర అనారోగ్యపాలైనట్లు మణిమారన్ వివరించాడు.

    Recommended Video

    Nawab Film Will Hits The Screens On September 27th
    లైట్ మాన్ సంఘం

    లైట్ మాన్ సంఘం

    మణిమారన్ మాట్లాడుతూ.. నేను లైట్ మాన్ సంఘంలో సభ్యుడిని. తనకు విషజ్వరం సోకడంతో ఆ సమయలో డాక్టర్లు 2 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. అంత డబ్బు నా దగ్గర లేదు. మణిరత్నం చిత్రానికి పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యా. ఆయనేమైనా సాయం చేస్తారేమోనని ఆయన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మణిమారన్ తెలిపాడు.

    లేఖ రాసినా

    లేఖ రాసినా

    చివరకు మణిరత్నంకు లేఖ రాసినాకూడా ప్రజయోజనం కలగలేదు. కానీ న్యాయస్థానం మాత్రం తనకు 2 లక్షలు సాయం చేయాలని లైట్ మాన్ సంఘాన్ని ఆదేశించింది. లైట్ మాన్ సంఘం వద్దకు వెళితే 20 వేలు లంచం అడిగారు. లంచం ఇచ్చినా కూడా లక్ష మాత్రమే ఇచ్చారు.

     ఆరోగ్యం క్షీణించి

    ఆరోగ్యం క్షీణించి

    నా ఆరోగ్యం బాగా క్షీణించడం వలన రెండు కాళ్ళూ పనిచేయడం లేదు. నా భార్యే కుటుంబాన్ని పోషిస్తోందని మణిమారన్ తన గోడు వెళ్లబోసుకున్నారు. మణిరత్నంకు, లైట్ మాన్ సంఘానికి వ్యతిరేకంగా ధర్నా చేసుందుకు కమిషనర్ వద్ద అనుమతి తీసుకున్నానని, వారు దిగొచ్చే వరకు నా నిరసన కొనసాగుతుందని మణిమారన్ తెలిపాడు.

    English summary
    Former crew member seeks permission to stage dharna against Mani Ratnam. Mani Ratnam's Guru movie lightman desperately needs finansial help
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X