తెరపై హీరోతో స్టెప్పులేయనున్న మ్యూజిక్ డైరక్టర్

ఏకంగా 'ఇలయ తలబది'తో కలిసి వెండితెరపై చిందులేసే పనిలో ఉన్నాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విజయ్-అమలాపాల్ జంటగా 'తలైవా' తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
ఇందులో విజయ్‌తో 'వాంగన్న వణక్కమన్నా..' అనే పాట పాడించాడు ప్రకాష్‌కుమార్. ఈ పాటలో విజయ్‌తో కలిసి అడుగేయనున్నాడట. పాటకు అనుగుణంగా జీవీ కనిపిస్తే బాగుంటుందన్న దర్శకుడి కోరిక మేరకు ఆయన విజయ్‌తో కలిసి చిందేయనున్నాడు.
ఏఆర్ రెహమాన్ మేనల్లుడైన సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తన స్నేహితురాలు, గాయని సైంధవిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి వివాహం ముహూర్తం ఖరారైంది. జూన్ 27న చెన్నైలో వీరి వివాహం జరుగనుంది. వీరిద్దరు పాఠశాల స్థాయి నుంచే మంచి స్నేహితులు. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఇద్దరూ కలిసి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.


Click it and Unblock the Notifications











