twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెరపై హీరోతో స్టెప్పులేయనున్న మ్యూజిక్ డైరక్టర్

    By Srikanya
    |

    G.V Prakash dance with Vijay in
    చెన్నై : హీరోలు అదిరిపోయే స్టెప్పులు వేయాలంటే మంచి బాణీలు ఉండాల్సిందే. అలాంటి ట్యూన్లు అందించే సంగీత దర్శకుల్లో మంచి డాన్సర్‌ కూడా ఉంటారని అంటుంటారు. అందుకు చక్కని ఉదాహరణ టాలీవుడ్‌ యువ సంచలనం దేవిశ్రీ ప్రసాద్‌. తానూ తక్కువకాదని అంటున్నాడు కోలీవుడ్‌ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌.

    ఏకంగా 'ఇలయ తలబది'తో కలిసి వెండితెరపై చిందులేసే పనిలో ఉన్నాడు. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో విజయ్‌-అమలాపాల్‌ జంటగా 'తలైవా' తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

    ఇందులో విజయ్‌తో 'వాంగన్న వణక్కమన్నా..' అనే పాట పాడించాడు ప్రకాష్‌కుమార్‌. ఈ పాటలో విజయ్‌తో కలిసి అడుగేయనున్నాడట. పాటకు అనుగుణంగా జీవీ కనిపిస్తే బాగుంటుందన్న దర్శకుడి కోరిక మేరకు ఆయన విజయ్‌తో కలిసి చిందేయనున్నాడు.

    ఏఆర్ రెహమాన్ మేనల్లుడైన సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తన స్నేహితురాలు, గాయని సైంధవిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి వివాహం ముహూర్తం ఖరారైంది. జూన్ 27న చెన్నైలో వీరి వివాహం జరుగనుంది. వీరిద్దరు పాఠశాల స్థాయి నుంచే మంచి స్నేహితులు. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఇద్దరూ కలిసి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.

    English summary
    
 Ilayathalapathy Vijay's Thalaivaa is creating big buzz in the industry. GV Prakash has scored the music for the film and now it is heard that the music director has appeared in a dance sequence in the film along with Vijay. GV has danced for the song, "Vaangana Vangangana..." along with Vijay and Santhanam. It is expected to be one of the highlights of the film and the makers plan to use it for the film's promotions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X