డిఫెరెంట్ స్టైల్.. హీరో చెల్లెలి హీరోయిన్ అవతారం

టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని సినిమా ఇండస్ట్రీలలో వారసుల హవా కొనసాగుతోంది. రోజుకో కొత్త హీరో, అదేవిధంగా రోజుకో కొత్త హీరోయిన్ వెండితెరకు పరిచయమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసిన వారసుల్లో ఎక్కువగా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తండ్రీ కూతుళ్లు ఉన్నారు కానీ అన్నాచెల్లెళ్లు లేరు. అలాంటి ఓ అరుదైన డిఫెరెంట్ స్టైల్‌లో ఓ హీరో చెల్లెలు హీరోయిన్‌గా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతుండటం సినీ వర్గాలలో చర్చనీయాంశం కావడమే గాక ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యచికితులను చేస్తోంది.

తమిళ సినీ పరిశ్రమలోని యంగ్ హీరోల్లో ఒకరు జీవీ ప్రకాశ్ కుమార్. సినిమా ఇండస్ట్రీలో ఈయనది ఓ ప్రత్యేక స్థానం. ఫిలిం ప్రొడ్యూసర్ గా, కంపోజర్ గా, హీరోగా అన్ని విభాగాల్లో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సినిమాలు చేస్తూ తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందాడు జీవీ ప్రకాశ్ కుమార్. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు తన చెల్లెలికి కూడా సినిమా రంగంలో రాణించేలా మెళకువలు నేర్పి సినిమాల్లోకి తీసుకొస్తున్నాడట ఈ యంగ్ హీరో.

 G. V. Prakash Kumar sister enters into the movies

జీవీ ప్రకాశ్ కుమార్ చెల్లెలి పేరు భవానీ శ్రీ. ఎంతో అందమైన ముఖ వర్చస్సు కలిగిన ఈ అమ్మాయి సినిమా హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టనుందని తెలుస్తోంది. తమిళ్ లో విరుమాండి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో ఈమె ఆరంగేట్రం కన్ఫర్మ్ చేశారట జీవీ ప్రకాశ్ కుమార్. విజయ్ సేతుపతి హీరోగా రానున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉండటంతో ఒక హీరోయిన్ గా ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్న దర్శకనిర్మాతలు రెండో హీరోయిన్ ఛాన్స్ జీవీ ప్రకాశ్ కుమార్ చెల్లెలు భవానీ శ్రీకి ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు లోనూ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. డిఫెరెంట్ స్టైల్ లో సినీ గడప తొక్కుతోంది కాబట్టి.. ఈమె సినీ ఇండస్ట్రీలో రాణించే అవకాశాలు ఉంటాయంటున్నారు జనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X