ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు.ఆయన సినిమాలకు పాడిన సైంధవి అనే గాయని మెళ్లో ఆయన తాళి కట్టబోతున్నారు.సైంధవి గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రకాష్ కుమార్ ట్రూపులో పాడుతూ వస్తుంది.అతి కొద్ది సమయంలోనే వీరి స్నేహం..ప్రేమగా మారింది.ఇటీవలే వీరి ప్రేమకు ఇరు పక్షాల పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది.దాంతో వచ్చే ఏడాది వీరు పెళ్లి కి లగ్నం పెట్టించుకున్నారు.ఇక జివి ప్రకాష్ సంగీతం అందించిన కథా నాయకుడు, డార్లింగ్, నాన్న చిత్రాలు తెలుగులోనూ మ్యాజికల్ హిట్ లుగా నిలిచాయి.అలాగే సైంధవి పాడిన అపరిచితుడు,ఆవకాయ్ బిర్యాని,అవారా,నాన్న లో పాటలు కూడా బాగా పేరు తెచ్చిపెట్టాయి.ఆమె మరిన్ని తెలుగు చిత్రాలుకు సైతం పాడుతోంది.అలాగే రీసెంట్ గా జి వి ప్రకాష్ ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్ధ తమ సినిమాకు అడిగినట్లు సమాచారం.వీరి వివాహానికి ధట్స్ తెలుగు అడ్వాన్స్ గా శుక్షాకాంక్షలు తెలియచేస్తోంది.