twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బ్రూస్‌లీ' అని హేళనగా పిలవబట్టే... టైటిల్

    By Srikanya
    |

    చెన్నై : 'డార్లింగ్‌', 'త్రిష ఇల్లనా నయనతార' చిత్రాల కమర్షియల్‌ విజయాలతో తన సత్తా చాటుకున్నారు జీవీ ప్రకాశ్‌. సంగీత దర్శకత్వం నుంచి హీరోగా మారిన ఈ కుర్రాడు.. హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఆయన నటించిన 'పెన్సిల్‌' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా కొత్త సినిమాల్లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు జీవీ.

    తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'బ్రూస్‌లీ'. 'పసంగ' పాండిరాజ్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన ప్రశాంత్‌ పాండిరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కెనన్యా ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర పూజా కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది.

    G.V. Prakash’s ‘Bruce Lee’ Launched

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కామెడీ థ్రిల్లర్‌, యాక్షన్‌ చిత్రంగా 'బ్రూస్‌లీ'ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జీవీప్రకాశ్‌ పాత్ర పేరు బ్రూస్‌లీ. జీవీ ప్రకాశ్‌ రూపాన్ని చూసి మిగిలిన యువకులు హేళనగా అలా పిలుస్తారట.. అందుకే చిత్రానికి బ్రూస్‌లీ అని పేరుపెట్టారు. కృతి కర్బందా హీరోయిన్.

    ఇక దర్శకుడి విషయానికొస్తే.. పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న 'హైకూ', 'ఇదు నమ్మ ఆళు' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అంతేకాకుండా 'నాలయ ఇయక్కునర్‌' సీజన్‌-4లో పాలుపంచుకుని తన ప్రతిభను చాటుకున్నారు.

    తన గురువు పాండిరాజ్‌ మాదిరిగానే ఈ సినిమాను కూడా పెద్దలతో పాటు చిన్నారులకు మరింత నచ్చేలా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

    G.V. Prakash’s ‘Bruce Lee’ Launched

    రామ్ చరణ్ తాజా చిత్రం ‘బ్రూస్ లీ' తమిళంలోనూ అదే రోజు ‘బ్రూస్ లీ 2' టైటిల్ తో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ టైటిల్ వివాదంలో పడింది. తమిళంలో ఇదే టైటిల్ తో సంగీత దర్శకుడు జివి ప్రకాష్ హీరోగా రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘బ్రూస్ లీ' కూడా వస్తోంది. ఇందులోనూ కృతి కర్భందే హీరోయిన్. దాంతో ఇప్పుడు వివాదం మొదలైంది. ఈ టైటిల్ తమ చిత్రానికి డైరక్ట్ గా పెద్ద దెబ్బకొట్టినట్లే అంటున్నారు తమిళ నిర్మాత, దర్శకుడు. ఈ మేరకు వారు తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసారు.

    నిర్మాత సెల్వ కుమార్ మాట్లాడుతూ..., "మాకు దయచేసి ‘బ్రూస్ లీ' టైటిల్ ని వదిలేయండి. ‘బ్రూస్ లీ2 ' అంటూ ఇంకో టైటిల్ తో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మొదట మేమే టైటిల్ ని రిజిస్టర్ చేసుకుని పబ్లిసిటీ మొదలుపెట్టాం. తెలుగులో వారు ఏం టైటిల్ పెట్టుకున్నాం మాకు ఇబ్బంది లేదు. తమిళ డబ్బింగ్ టైటిల్ మాత్రం మార్చమంటున్నాం. వారు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో రిజిస్టర్ చేసారని తెలిసింది. మేము అక్కడే చేసాం. అలా ఎలా రెండు టైటిల్స్ రిజిస్టర్ చేసి ఫర్మిషన్ ఇచ్చారో మాకు తెలియటం లేదు. ఈ విషయమై తమిళ నిర్మాతల మండలిలో మేము ఫిర్యాదు చేస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది" అన్నారు.

    English summary
    Music composer turned hero G.V. Prakash is turning heads with his performances. His first two films ‘Darling’ and ‘Trisha Illana Nayanthara’ did a decent business at the box office. Earlier, he announced that he will be collaborating with director Prasanth Pandiyara for his next, titled ‘Bruce Lee’. The project has been officially launched.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X