సూపర్ స్టార్ రజనీకాంత్‌తో గడ్కరీ సమావేశం, మద్దతుకు ప్రయత్నాలు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కలిశారు. శుక్రవారం రజనీ ఇంటికి వెళ్లి ఆయనతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని గడ్కరీ రజనీకాంత్‌ను కోరినట్లు సమాచారం.
వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీకే ఓటు వేయాలంటూ తన అభిమానులకు రజనీ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్ మద్దతు కోసం తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











