స్వీల్ బర్గ్ చిత్రం తీసుకున్న నాగచైతన్య దర్శకుడు
ప్రముఖ హాలీవుడ్ దర్సకుడు స్పీల్ బర్గ్ తాజా చిత్రం 'ది అడ్వంచరస్ ఆఫ్ టిన్ టిన్" డిస్ట్రిబ్యూషన్ తమిళ ప్రాంత హక్కులను గౌతమ్ మీనన్ తీసుకున్నారు. నాగచైతన్యతో ఏమి మాయ చేసావే చిత్రంతో తెలుగునాట పాపులర్ అయిన ఈ దర్శకుడు స్పీల్ బర్గ్ అంటే ప్రాణం. అందులోనూ టిన్ టిన్ కామిక్స్ అంటే బాగా ఇష్టం. అందుకే నవంబర్ 11న విడుదల అవుతున్న ఈ చిత్రం పంపిణీ హక్కులను మంచి రేటు ఇచ్చి మరీ సొంతం చేసుకున్నారు.
ప్రముఖ బెల్జియన్ రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్ 'జార్జస్ ప్రాస్పర్ రెమి"హెర్జ్ అనే కలం పేరుతో రాసిన 'ది అడ్వంచర్స్ ఆఫ్ టిన్ టిన్" కామిక్ పుస్తకాల్లోని మూడు కథలను తీసుకుని స్పీల్‌బర్గ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1929లో ఆరంభించి 1983 వరకు... అంటే తను చనిపోయే వరకు హెర్జ్ 24 భాగాలుగా ఈ కథలను అందించారు. కథలను రచించడంతో పాటు ఆకర్షణీయమైప కార్టూన్‌లతో ఆ పుస్తకాలను అందర్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు హెర్జ్.
పీటర్ జాక్సన్,స్టీఫెన్ స్పీల్‌బర్గ్, కాథ్లీన్ కెన్నెడి కలిసి దాదాపు రూ.604 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. టిన్‌టిన్ సిరీస్‌లో భాగంగా హెర్జ్ రచించిన 'ది క్రాబ్ విత్ ది గోల్డెన్ క్లాస్, ది సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్, రెడ్ రాకమ్స్ ట్రెజర్" కథలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన తొలి యానిమేషన్ చిత్రం ఇదే కావడం ఓ విశేషం.
కథ విషయానికి వస్తే 'ది అడ్వంచర్స్ ఆఫ్ టిన్ టిన్"లో తన పూర్వికులు దాచిన నిధిని కనుగొనాలనే ప్రయత్నంలో ఉంటాడు హీరో. ఆ నిధిని చేజిక్కించుకోవాలని జైలు నుంచి పారిపోయిన ఓ గూండా కూడా అనుకుంటాడు. మరోవైపు ఇద్దరు డిటెక్టివ్‌లు కూడా ఈ నిధిని కనుగొనాలనే ప్రయత్నంలో ఉంటారు. ఇలా మూడు దారుల్లో నిధికోసం వేట సాగుతుంది. ఇక టిన్ టిన్‌గా జమీ బెల్ నటించాడు.


Click it and Unblock the Notifications











