నా క్లోజ్ ఫ్రెండ్ ఆయనే: సమీరా రెడ్డి
అశోక్, నరసింహ చిత్రాల్లో నటించి తెలుగులో ఎన్టిఆర్ ప్రియురాలుగా పేరుతెచ్చుకున్న ముద్దుగుమ్మ సమీరా రెడ్డి. ఆమె రీసెంట్ గా 'వేట్టై' చిత్రం షూటింగ్‌లో గాయపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె మాట్లాడుతూ.. నాకు దర్శకుడు గౌతమ్ మీనన్ అంటే ప్రత్యేక అభిమానం. 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్', 'ఎర్రగులాబీలు' చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసిన తరువాత ఆ అభిమానం రెట్టింపు అయింది. నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఆయనా, క్లోజ్ ప్రెండ్ అయినా ఆయనే అని తేల్చి చెప్పింది.అలాగే ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది అంది.
అలాగని బయిట ప్రెండ్స్ లేరని అనను.. బాలీవుడ్, టాలీవుడ్‌లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.తీరిక దొరికితే చాలు వాళ్లతో కాలక్షేపం చేస్తాను. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే టైమే తెలియదంటే నమ్మండి. ఇక నటన విషయానికి వస్తే ఇప్పుడు ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమపైనే దృష్టి సారించాను. ప్రస్తుతం మాధవన్‌తో కలిసి లింగుస్వామి దర్శకత్వంలో 'వేటై' చిత్రంలోనూ, ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్‌తో కలిసి 'వెడి' చిత్రంలోనూ నటిస్తున్నా. తెలుగు సినిమాల్లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా అంది. మరి తెలుగులో ఆమెకు రీఎంట్రీ ఇచ్చి ఆదుకునే దర్శక,నిర్మాతలెవరో చూడాలి.


Click it and Unblock the Notifications











