హాట్ న్యూస్ : 'ఏ మాయ చేసావె' గౌతమ్ మీనన్ స్ట్రైయిట్ తెలుగు చిత్రం
'ఏ మాయ చేసావె'చిత్రంతో తెలుగునాట తనకంటూ ఓ ముద్ర వేసుకున్న దర్సకుడు గౌతమ్ మీనన్. ఆయన తన తదుపరి తెలుగు చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో చేస్తున్నారు.ఇక ఈ చిత్రంలో తనే పరిచయం చేసిన సమంత హీరోయిన్ గా చేస్తూండగా రామ్ హీరోగా ఎంపికయ్యారు.ఇక ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించనున్నారు.ఈ విషయాన్ని మీడియాకు వివరిస్తూ...ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాత బెల్లంకొండ సురేష్ వివరిస్తూ 'గౌతమ్ మీనన్ ఓ అద్భుతమైన కధతో ఈ చిత్రాన్ని తెరకెక్కించ బోతున్నారు. ఈ సబ్జెక్ట్ చాలా ఆసక్తిగా, థ్రిల్లింగ్ గా వుంటుంది.
రామ్ ఈ కధ వినగానే వెంటనే చేద్దాం అన్నాడు. గౌతమ్ మీనన్ 'ఏ మాయ చేసావె' తో స్టార్ అయిన సమంత మళ్ళి ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆస్కార్ అవార్డ్ విజేత ది గ్రేట్ ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. ఇప్పటికే రెండు పాటలు రికార్డింగ్ కూడా పూర్తయింది. మే లో షూటింగ్ ముహూర్తం చేసి జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మా సాయిగణేష్ బ్యానర్ కి ఇది మరో ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. స్రవంతి రవి కిషోర్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నాం'అన్నారు. రామ్ హీరోగా శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ 'కందిరీగ'చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











