వర్మ చిత్రంలో వాయిస్ ఓవర్ నాగచైతన్య దర్శ కుడుతో ..
నాగ చైతన్యతో ఏమి మాయ చేసావే చిత్రం రూపొందించి విజయం సాధించిన గౌతమ్ మీనన్ చేత వర్మ..తాజాగా వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారు. అయితే అది తెలుగులో కాదు. తమిళంలో సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన రక్త చరిత్ర చిత్రం కోసం. సూర్య కు సన్నిహితుడైన గౌతమ్ మీనన్ ఈ చిత్రంలో సూర్య నటించిన పార్ట్ కు డైలాగులు కూడా రాసారని సమాచారం. సూర్యతో గౌతం మీనన్ గతంలో కాక కాక వంటి సంచలనాత్మక హిట్ ఇచ్చారు. ఆ తర్వాత సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రం రూపొందించారు. అప్పటినుంచి వీరి స్నేహం పెరుగుతూ వచ్చింది. ఎంతలా అంటే సూర్య నటించే ప్రతీ చిత్రానికి డైలాగు వెర్షన్ ని గౌతమ్ మీనన్ సరిచేసే దాకా. ఆ అనుబంధం తోనే వర్మ అడిగిన వెంటనే రక్త చరిత్రకి వాయస్ ఇవ్వటానికి గౌతం ముందుకొచ్చారు. ఇక రామ్ గోపాల్ వర్మ..రక్త చరిత్ర పార్ట్ వన్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి జనాల్ని దడిపించిన సంగతి తెలిసిందే.
గౌతమ్ మీనన్ రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 2 సూర్య ప్రియమణి gautam menon rgv surya rakta charitra2 naga chaitanya


Click it and Unblock the Notifications