హీరో కొడుకుని ముద్దుల్లో ముంచెత్తడానికి గౌతమి కూతురు రెడీ..గౌతమి సంచలనంగా!

Recommended Video

రొమాన్స్ కాస్త ఘాటుగానే....!

కమల్ హాసన్ తో విడిపోయాక సీనియర్ నటి గౌతమి తన కుమార్తె సుబ్బలక్షితో వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. గౌతమి కుమార్తె సుబ్బ లక్ష్మి సినీరంగ ప్రవేశం త్వరలో ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ గౌతమి తన కుమార్తెని లాంచ్ చేయడనికి సరైన చిత్రం కోసం ఎదురుచూస్తోంది. ఆ తరుణం ఆసన్నం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రం తమిళ్ కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఎంపిక చేయలేదు. తాజాగా గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి పేరు బయటకు రావడతో ఆసక్తిగా మారింది.

ఇదే సరైన చిత్రం అని

ఇదే సరైన చిత్రం అని

విక్రమ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు ధృవ్ ని ఇంకొన్ని రోజులు ఆగాక సినిమాల్లోకి లాంచ్ చేయాలనీ భావించాను. కానీ అర్జున్ రెడ్డి చిత్రం చూసాక తన నిర్ణయం మార్చుకున్నట్లు విక్రమ్ తెలిపాడు. ధృవ్ కి తొలి మూవీగా అర్జున్ రెడ్డి సరైన చిత్రం అని తాను భావించినట్లు విక్రమ్ తెలిపారు.

రీమేక్ హక్కులు హాట్ కేకుల్లా

రీమేక్ హక్కులు హాట్ కేకుల్లా

అర్జున్ రెడ్డి రీమేక్ హక్కులు పలు భాషల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. టాలీవుడ్ లో ఈ చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది మరి.

 అర్జున్ రెడ్డి గెటప్ లో ధృవ్

అర్జున్ రెడ్డి గెటప్ లో ధృవ్

అర్జున్ రెడ్డి చిత్రం కోసం విజయ్ దేవర కొండా గడ్డం లుక్ లో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ధృవ్ కూడా ఈ చిత్రం కోసం గడ్డం పెంచుతున్నాడు. ఇటీవల విక్రమ్ బాగా గడ్డం పెంచి ఉన్న ధృవ్ పోటోని సోషల్ మీడియాలో షేర్ చేరిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రం వర్మ పేరుతో తెరకెక్కుతోంది.

 షాలిని పాండేలా ఎవరు చేయగలరు

షాలిని పాండేలా ఎవరు చేయగలరు

అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవర కొండా అద్భుతంగా నటించాడు. అదేస్థాయిలో హీరోయిన్ షాలిని పాండే కూడా పెర్ఫామ్ చేసింది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ సినిమాలో యువతని ప్రధానంగా ఆకర్షించాయి. విజయ్, షాలిని మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో బాగా పండింది. ఆ స్థాయిలో తమిళంలో ఏ హీరోయిన్ పెర్ఫామ్ చేయగలదని వర్మ చిత్రం యూనిట్ ఎదురుచూస్తోంది.

 ధృవ్ తో రొమాన్స్ కు గౌతమి కూతురు రెడీ

ధృవ్ తో రొమాన్స్ కు గౌతమి కూతురు రెడీ

ఈ చిత్రంలో హీరోయిన్ గా గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి పేరు పరిశీలిస్తున్న తెలుస్తోంది. గౌతమి కూడా తన కుమార్తెని ఈ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ముద్దు ముచ్చట్లకు సిద్దమేనా

ముద్దు ముచ్చట్లకు సిద్దమేనా

ఈ చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు కాస్త ఘాటుగానే ఉంటాయి. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్, షాలిని పాండే మధ్య ముద్దు సన్నివేశాలు ఘాటుగా ఉంటాయి. ఆ తరహా సన్నివేశాలలో తొలి చిత్రంలోనే నటించాలంటే కాస్త ఆలోచిస్తారు. ఇక గౌతమి వంటి సీనియర్ హీరోయిన్ కుమార్తె నటిస్తోందంటే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడం ఖాయం. కానీ ఇలాంటి వారికి భయపడకుండా తన కుమార్తెని వర్మ చిత్రంలో నటింపజేసేందుకు గౌతమి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

షూటింగ్ మొదలైంది

షూటింగ్ మొదలైంది

హీరోయిన్ ఎంపిక జరగకుండానే వర్మ చిత్ర షూటింగ్ మొదలైపోయింది. గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావలసిఉంది. సుబ్బలక్ష్మి హీరోయిన్ గా ఎంపికైతే గౌతమి సంచలన నిర్ణయం తీసుకున్నట్లే అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X