twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌కు కరోనా: నీతులొద్దు.. ఇతరులను ఇబ్బంది పెట్టకు.. గౌతమికి నెటిజన్ల షాక్!

    |

    విలక్షణ నటుడు, మక్కల్ నీది మైయామ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌‌కు చెందిన చెన్నై ఆళ్వార్‌పేటలోని నివాసానికి మున్సిపల్ అధికారులు కరోనా స్టిక్కర్లు అతికించడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాము చేసిన తప్పును తెలుసుకొన్న అధికారులు వివరణ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. అయితే ఈ వివాదంపై గౌతమి ఏమని స్పందించారంటే..

     ముగిసిన గందరగోళం

    ముగిసిన గందరగోళం

    కమల్ హాసన్ ఇంటికి కరోనా స్టిక్కర్ వివాదంపై గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్ జీ ప్రకాశ్ స్పందిస్తూ.. ఆయన మాజీ జీవిత భాగస్వామి గౌతమి అడ్రస్ ఈ గందరగోళానికి కారణమైంది. ఇటీవల ఆమె దుబాయ్ నుంచి ఇటీవల తిరిగి వచ్చారు. ఆమె పాస్ట్‌పోర్టులో అడ్రస్ కమల్ ఇంటి పేరుపై ఉండటంతో సిబ్బంది ఆయన ఇంటికి స్టిక్కర్ అతికించారు. దాంతో కమల్‌కు కరోనా అనే విధంగా ప్రచారం జరిగింది అని అన్నారు.

    స్టిక్కర్ల తొలగింపు

    స్టిక్కర్ల తొలగింపు

    కమిషనర్ జీ ప్రకాశ్ వివరణ తర్వాత మీడియాలో ఈ వివాదం సద్దుమణిగింది. వెంటనే కమల్ హాసన్ ఇంటికి అతికించిన స్టిక్కర్‌ను చెన్నై మున్సిపల్ అధికారులు తొలగించారు. కమల్ కూడా తన ఆరోగ్యంపై క్లారిఫికేషన్ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు.

    ఆరోగ్య పరిస్థితి గౌతమి ట్వీట్‌

    ఇదిలా ఉండగా, ఇవేమీ పట్టించుకోకుండా ట్విట్టర్‌లో తన ఆరోగ్యం గురించి ట్వీట్ చేశారు. ప్రతీ ఒక్కరు బాగుండాలని కోరుకొంటున్నాను. నేను సురక్షితంగా ఉన్నాను. 20 రోజుల క్రితం నేను దుబాయ్ నుంచి తిరిగి వచ్చాను. నా ఆరోగ్యం చాలా బాగుంది. మీరు కూడా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోండి. ఈ క్లిష్టపరిస్థితులపై విజతతో, సానుకూల దృక్పథంతో స్పందించండి అంటూ ట్వీట్ చేశారు.

    మేము జాగ్రత్తగానే.. మీరు రూల్స్ పాటించండి

    మేము జాగ్రత్తగానే.. మీరు రూల్స్ పాటించండి

    గౌతమి ట్వీట్‌పై కొందరు నెటిజన్లు అసహనంతో స్పందించారు. మేము నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తాం గానీ.. మీరు పాస్‌పోర్టులో అడ్రస్‌ను మార్పించుకొండి. అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్లలో మీ అడ్రస్‌లను మార్పించుకొంటే ఇతరులకు ఇబ్బంది కలుగదు. సినిమాలో చివరి సీన్‌లో పోలీసులు నీతులు చెప్పినట్టు చేయకు అని కొందరు సెటైర్లు వేశారు.

    Recommended Video

    Vakeel Saab : Shruti Haasan To Pair Up With Pawan Kalyan In Vakeel Saab?
    13 ఏళ్ల తర్వాత

    13 ఏళ్ల తర్వాత

    కమల్ హాసన్, గౌతమి సుమారు 13 ఏళ్లు కలిసి సహజీవనం చేశారు. అయితే వారి మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో 2018లో విడిపోయారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటున్నారు. అయితే తన పాస్‌పోర్టులో అడ్రస్ మార్చుకోకపోవడంతో తాజాగా చిన్న గందరగోళానికి దారి తీసింది.

    English summary
    Actor Gautami Tadimalla reaction on Corona quarantine sticker to Kamal Haasan's house: Actor, Makkal Needhi Maiam Chief Kamal Haasan scraps Coronavirus Rumours. Reports in social media suggest that, Kamal Haasan has coronavirus and he is self quarantining in his Alwarpet house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X