బీజేపీకి సినీ నటి గౌతమి రాజీనామా.. చీటింగ్.. వెన్నుపోటు అంటూ సంచలన ఆరోపణలు

సినీ, రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న దక్షిణాది నటి గౌతమి సంచలన నిర్ణయం తీసుకొన్నది. గత 25 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్న ఆమె ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొన్నది. గౌతమి తీసుకొన్న నిర్ణయం తమిళనాడులో సెన్సేషన్‌గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీత తరఫున బలంగా తన వాదనలు వినిపించే ఆమె.. బీజేపీకి రాజీనామా చేయడం దక్షిణాదిలో చర్చనీయాంశమైంది. ఆమె రాజీనామాకు కారణాలు ఏమిటనే విషయంలోకి వెళితే..

గౌతమి రాజీనామాకు పలు కారణాలు వినిపిస్తున్నప్పటికీ.. పార్టీలోని ఓ వ్యక్తి కొన్ని విషయాల్లో నమ్మించి మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఆమె అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నది అనే విషయం మీడియాలో ప్రముఖంగా మారింది.

Gautami Tadimalla resigned to BJP: Actress made sensational allegations on Tamilnadu leaders

బీజేపీ తరఫున క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించలేదు. అయినప్పటికి ఆమె బీజేపీలో అంకితభావంతో పనిచేశారు. అయితే ఇటీవల తమిళనాడు నేతలతో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు కావడంతో ఆమె పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిసింది. తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు, కార్యకర్తలకు తెలిపారు. అంతేకాకుండా సుదీర్ఘమైన లేఖను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

బీజేపీతో నాకు ఉన్న 25 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. నా రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు స్టేట్ ఛీప్ అన్నామలైకి పంపించాను అని గౌతమి ట్విట్టర్‌లో తెలిపారు. అంతేకాకుండా లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. నా నుంచి డబ్బు, ఆస్తులు, కొన్ని డాక్యుమెంట్ల రూపంలో మోసం చేశారు. అంతేకాకుండా పార్టీ నేతల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. అంతేకాకుండా నాకు ద్రోహం చేసిన వ్యక్తికి, జీవితాంతం నా ఆస్తులను లాగేసుకొని చీట్ చేసిన ఓ వ్యక్తికి కొందరు పార్టీ నేతలు సపోర్ట్ చేస్తున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేసింది.

Gautami Tadimalla resigned to BJP: Actress made sensational allegations on Tamilnadu leaders

తన రాజీనామా అనంతరం రాసి లేఖలో గతంలో తాను జరిగిన చీటింగ్‌పై పోలీస్ కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, న్యాయ వ్యవస్థ తనకు న్యాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాను అని గౌతమి వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X