ఆఫర్స్ ఇస్తే మళ్ళీ ప్రూవ్ చేసుకుంటా: గౌతమి
తన అందచందాలతోనే కాక నటనతోనూ రాణించిన గౌతమి ఈ మధ్య కాలంలో వెండితెరకు పూర్తి స్ధాయిలో దూరమైంది. అయితే తాను నటించటానికి రెడీగా ఉన్నా పరిశ్రమనుంచి ఆఫర్స్ రావటం లేదని ఆమె వాపోతోంది. ఆమెకు ఏ తరహా పాత్ర ఇవ్వాలో డిసైడ్ అయితే అంత మంచి నటితో చేయించుకోవటానికి అభ్యంతరం లేదని కొందరంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఓ టీవీ సీరియల్ ఒప్పుకుంది. అక్కడ కూడా ఫుల్ టైమ్ నటిగా కొనసాగనున్నానని చెప్తోంది. ఇక కొంతకాలంగా ఆమె కమల్ హాసన్ తో సహజీవనం చేస్తోంది. వారి కాంబినేషన్లో క్షత్రియపుత్రుడు వంటి అధ్బుతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.
కమల్ హాసన్ గౌతమి శ్రీనివాస కళ్యాణం క్షత్రియపుత్రుడు శృతి హాసన్ భరతన్ kamal hassan gautami srinivasa kalyanam sruthi hassan


Click it and Unblock the Notifications