మణిరత్నం ‘కడలి’ ముద్దుసీన్(ఫోటో)
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదల చేసారు. ఈ ట్రైలర్లో హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్ దర్శనం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. తొలి పరిచయంలోనే ఇద్దరికి లిప్ లాక్ ముద్దు సీన్ల రుచి ఏమిటో చూపెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఈ ముద్దు సీన్ గురించి ఈ చిత్ర హీరో గౌతం ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ..... ''ముద్దు సీన్ ఉందని గతంలో మీడియాలో రూమర్ విన్నాను. కానీ మణి సార్ మాత్రం మాతో ముద్దు సీన్ ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఒక రోజు ఉన్నట్టుండి ఈ రోజు ముద్దు సీన్లో నటించాల్సి ఉంటుందని షాకిచ్చారు.
ఆయన చెప్పినప్పుడు కాస్త నర్ వెస్ అనిపించా..... మా ఇద్దరికి సినిమాలో ముద్దు సీన్ ప్రాధాన్యత ఏమిటో వివరించి ఎలాగో అలా చేయించారు. లైఫ్ లో ఇద్దరం తొలిసారి ముద్దు సీన్లో పాల్గొన్నాం. ఆ సమయంలో ఫీలింగ్స్ గురించి మాత్రం అడగొద్దు. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది'' అని గౌతమ్ చెప్పకొచ్చాడు.
మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మీ ప్రసన్న, యాక్షన్ స్టార్ అర్జున్. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.


Click it and Unblock the Notifications












