మైనర్లను ముద్దు సీన్లలోనా?...మణిరత్నంపై ఫైర్

By Srikanya

చెన్నై : తమిళ సీనియర్ రచయితలు చారు నివేదిత, జ్ఞాని శంకరన్‌లు 'కడలి' ముద్దు సీన్‌పై ఘాటుగా స్పందించారు. మైనర్లను ముద్దు సీన్లలో నటింపజేయడం, వారిమధ్య శృంగారంతో కూడిన ప్రేమ దృశ్యాలు చూపించడం వల్ల యువత చెడిపోయే అవకాశముందని వ్యాఖ్యానించారు. నిర్మాతలు, దర్శకులు బాధ్యతగా వ్యవహరించి, సమాజానికి మేలు చేకూర్చే కథాంశాలను ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు.

పదహారేళ్ల అమ్మాయిని ముద్దు సీన్లలో నటింపజేస్తారా అంటూ విమర్శకులు 'కడలి' చిత్ర దర్శకుడు మణిరత్నంపై మండిపడుతున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్, సీనియర్ నటి రాధ కుమార్తె తులసి మధ్య లిప్ లాక్ సన్నివేశాన్ని చిత్రీకరించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఆ దృశ్యంతో కూడిన పోస్టర ్లకు విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో, అదే స్థాయిలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా వుండగా, చిన్న వయస్సులోనే ప్రేమ సన్నివేశాల్లో నటింపజేయడానికి పలువురు నటీనటులు వెనకేసుకొస్తున్నారు. తమిళ నటుడు పార్తిబన్ ఈ విషయంపై స్పందిస్తూ.. యువత తప్పుదారి పట్టించాలన్న ఉద్దేశంలో ముద్దు సన్నివేశాలు తీయరని, ప్రేమలోని గొప్పతనాన్ని చూపే ప్రయత్నమేనని అన్నారు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కడల్‌'. కార్తీక్‌ కుమారుడు గౌతమ్‌, రాధ కుమార్తె తులసి నాయకానాయికలుగా పరిచయం అవుతున్నారు. తెలుగులో 'కడలి'గా విడుదల కానుంది. ఇటీవలే నటీనటులను మీడియాకు పరిచయం చేశారు మణిరత్నం. ఈ కార్యక్రమంలో మణిరత్నం, ఏఆర్‌ రెహ్మాన్‌, అర్జున్‌, గౌతమ్‌, తులసి తదితరులు పాల్గొన్నారు. వేదికపైకి వచ్చిన రెహ్మాన్‌ను అర్జున్‌ ప్రశ్నిస్తూ.. 20 ఏళ్లుగా మణిరత్నం సినిమాలకు సంగీతం సమకూర్చుతున్నారు. అందులో రహస్యమేంటి అని అడిగారు. 'దిష్టి పెట్టేయకండి.' అంటూ రెహ్మాన్‌ నవ్వుతూ సమాధానమిచ్చారు.

అనంతరం మాట్లాడుతూ... నన్ను 'రోజా' ద్వారా సినీ పరిశ్రమకు తీసుకొచ్చారు. ఆ రకంగా మణిరత్నం నా గురువు. తన చిత్రంలో పాటలు అలా కావాలి, ఇలా కావాలి అని అడగరు. సందర్భం మాత్రమే చెబుతారు. ఆయన ఆలోచనలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేనే బాణీలు కడుతా. ఆ నమ్మకమే మా మధ్య ఉంది. అంతే తప్ప రహస్యాలేవీ లేవన్నారు. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు(కడలి) ప్రచారచిత్రంలో గౌతమ్‌, తులసిల గాఢముద్దు సన్నివేశం ఉంది. దీనికి చిత్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X