హాట్ టాపిక్ : 'కడలి' హీరోతో రజనీకాంత్ కూతురు
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను కూడా పూర్తి చేసిందట. ధనుష్‌ను హీరోగా అనుకున్నా.. ప్రస్తుతం ఆయన ఇతర చిత్రాల్లో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం వెతుకులాటలో పడింది ఐశ్వర్య. అలా తన కన్ను నటుడు కార్తీక్ కుమారుడు గౌతంపై పడినట్టు సమాచారం. ఐశ్వర్య తదుపరి చిత్రంలో గౌతమే హీరో అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ సినిమా కథ కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక ప్రక్రియ సాగుతోంది. అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నాడు. తొలి చిత్రం ద్వారా సంపూర్ణ విజయాన్ని అందుకోని ఐశ్వర్య.. ఈ సినిమాతో ఆ కల నెరవేర్చుకుంటారేమో వేచిచూడాలి.
మరో ప్రక్క డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న '3'రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఈ చిత్రం త్వరలో హిందీలో తెరకెక్కనుంది. నిఖిల్ అద్వానీ ఈ చిత్రం రీమేక్ చేయనున్నారు. హిందీ నేటివిటీకోసం కొన్ని మార్పులు చేస్టున్నట్లు చెప్తున్నారు. అలాగే '3'లో నటనతో ఆకట్టుకున్న శ్రుతిహాసన్ హిందీలో రీమేక్‌లోనూ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ హీరోగా ఆయన భార్య ఐశ్వర్య తెరకెక్కించిన చిత్రం '3'. అందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది. చిత్ర విడుదలకు ముందే 'వై దిస్ కొలవెరి డి' పాట సంచలనం సృష్టించటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అత్యధిక కేంద్రాల్లో చిత్రం విడుదలైంది. వూహించిన ఫలితం దక్కలేదు. నటిగా శ్రుతిహాసన్ మంచి మార్కులు మాత్రం కొట్టేసింది.తెలుగులో సైతం ఈ చిత్రం మొదటి రోజే పెద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుని చతికిలపడింది. రైట్స్ కొనుక్కున్న నిర్మాత నట్టికుమార్ ని నట్టేట ముంచేసింది.


Click it and Unblock the Notifications












