'కడలి' హీరో ..కొత్త చిత్రం టైటిల్ ఇదే
భర్త ధనుష్‌తో '3' తెరకెక్కించిన ఐశ్వర్యకు కూడా దర్శకురాలిగా ఇది రెండో సినిమా. యువన్‌శంకర్ రాజా బాణీలు కూర్చుతున్నారు. వినోదభరితంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. హీరోయిన్ , ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంపై ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ మరోసారి దర్శకత్వం వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం 'త్రీ' పరాజయం పాలైంది. రెండో సినిమా త్వరలోనే మొదలవుతుందని తెలిసింది. ఇందులో 'కడలి' హీరో గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తారు. క్రికెట్ బెట్టింగ్‌ల నేపథ్యంగా ఈ చిత్రం ఉంటుందని చెన్నై సమాచారం.
మరో ప్రక్క తెలుగులో విజయవంతమైన 'అలా మొదలైంది' తమిళ రీమేక్ లో నటించటానికి కమిటయ్యారు. ఈ చిత్రాన్ని రవి త్యాగరాజన్ డైరక్ట్ చేయనున్నారు. ఇమామ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మిగాతా కాస్టింగ్ డిటేల్స్ వెలవడనున్నాయి. ఇక గౌతమ్ మరో ప్రక్క ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో చిత్రం కూడా ఒప్పుకున్నారు.


Click it and Unblock the Notifications












