గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి ...
సూర్య ప్రస్తుతం 'సింగం-2'లో నటిస్తున్నాడు. ఆయన తర్వాతి చిత్రం దర్శకుల జాబితాలో లింగుస్వామి, శశికుమార్, గౌతమమీనన్ పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఈ సందిగ్ధతకు తెరదించుతూ సూర్య సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు గౌతమ్ మీనన్ ప్రకటించాడు. తన వద్ద ఉన్న కథను సూర్యకు వినిపించానని, సంతృప్తి వ్యక్తం చేసి కాల్షీట్‌ను కూడా కేటాయించారని, మే నెలలో ప్రారంభించనున్నామని, త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించాడు.
గౌతమ్ మీనన్ పై 'నీథానే ఎన్ పోన్‌వసంతం' (తెలుగులో 'ఎటో వెళ్ళిపోయింది మనసు') నిర్మాత కేసులు పెట్టారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటెయిన్‌మెంట్‌కు చెందిన నిర్మాత ఎల్రెడ్ కుమార్‌తో మీనన్ పై వారు కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. చిత్రం ఆశించిన కలెక్షన్లు రాబట్ట లేకపోతే దర్శకుడి మీద కేసు పెట్టడం తగదని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
నిర్మాత ఎల్రెడ్ కుమార్ మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో, సాధారణంగా ఎక్కువగా మాట్లాడని మీనన్ బహిరంగ లేఖతో సినీ వర్గాల ముందుకు వచ్చారు. ఈ లేఖలో ఆయన సినీ వర్గాలు ఐక్యంగా వచ్చి తనకు సాయపడాలని కోరారు. ఈ పోరాటాన్ని తాను ఒంటరిగా ఎదుర్కోలేనని పేర్కొన్నారు. 'చిత్రం అంచనాల మేరకు విజయం సాధించకపోతే నిర్మాతలు కేసులు పెడుతారు జాగ్రత్తగా ఉండండి' అంటూ ఆయన తన సహసినీదర్శకులకు సూచించారు.


Click it and Unblock the Notifications












