రివ్యూలపై మండిపడ్డ నాగచైతన్య దర్శకుడు
నాగచైతన్యతో ఏమి మాయ చేసావే చిత్రం రూపొందించిన గౌతమ్ మీన్ రీసెంట్ గా ఏక్ దివానా తా టైటిల్ తో ఓ హిందీ సినిమాని డైరక్ట్ చేసారు. అయితే బాలీవుడ్ మీడియా ఆ సినిమాని ఏకిపారేస్తూ రివ్యూలు రాసింది. దాంతో తన చిత్రాన్ని విమర్శించిన వారిపై గౌతమ్ మీనన్ ఫైర్ అయ్యారు. సినిమా ప్లాప్ అయినా బాధపడని గౌతమ్ మీనన్ ఈ చిత్రంపై అక్కడి పత్రికలు చేసిన విమర్శలకు ఫైర్ అయ్యారు. అంతకుముందు విమర్శల గురించి పట్టించుకోవడం గాని, బాధపడటం గాని ఉండదని తన ట్విట్టర్‌లో పేర్కొన్న ఈ దర్శకుడు హిందీ చిత్రం ఏక్ దీవానాతాపై వచ్చిన విమర్శలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సద్విమర్శలు చేయలేదన్నారు.
మిడి మిడి జ్ఞానంతో కొందరు తన చిత్రాలను విమర్శించవచ్చునని, అయితే అలాంటి వారు ఒక కళాకారుడి పయనాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. శింబు, త్రిష జంటగా ఆయన రూపొందించిన విన్నై తాండి వరువాయా, తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో నాగ చైతన్య, సమంత జంటగా తెరకెక్కించగా సూపర్ హిట్ అయ్యింది. కాగా గౌతమ్ మీనన్‌కు ఆగ్రహం కలిగించిన విషయం ఏమిటంటే విన్నై తాండి వరువాయా చిత్రాన్ని హిందీలో ఏక్ దివానా తా పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రం అక్కడ బోల్తా కొట్టింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్...నాని,సమంత కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఎటో వెళ్లిపోయింది మనస్సు టైటిల్ తో ఆ చిత్రం తెలుగులో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











