మనస్పర్థలు వదిలేసి ఆ మ్యూజిక్ డైరక్టర్ తోనే...

అయితే అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవటంతో గౌతమ్ మీనన్ ఇతరుల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన రూపొందించిన 'విన్నైతాండి వరువాయా'కు ఏఆర్ రెహమన్, 'నీదానే ఎన్ పొన్ వసంతం'కు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్‌తో హరీష్ మళ్లీ కలిసి పని చేయనున్నాడు., అజిత్ హీరోగా గౌతమ్ నిర్మించనున్న ఓ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అజిత్‌తో తనకు ఇదే తొలి చిత్రం కావటంతో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట గౌతమ్ మీనన్. ఇందులో భాగంగా గతంలో తనకు ఎన్నో సూపర్‌హిట్ పాటలను అందించిన హరీష్ జైరాజ్ వైపే మొగ్గు చూపాడట.
నాగచైతన్యకి 'ఏ మాయ చేశావె" చిత్రంతో హిట్ ఇచ్చి కెరీర్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం అంటే హీరోలందరికీ ఆసక్తే. అయితే రీసెంట్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్యతో అనుకున్న చిత్రం ఆగిపోయింది. కథ కుదరలేదని మరీ సూర్య ఆ ప్రాజెక్టు ఆపుచేసి,మరో సినిమా ప్రారంభించేసాడు. అంతకుముందు విజయ్ సైతం గౌతమ్ మీనన్ కి హ్యాండ్ ఇచ్చాడు. అయితే గౌతమ్ మీనన్ మాత్రం సూపర్ స్టార్ హీరోతో జత కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆ స్టార్ హీరోనే అజిత్. అజిత్ ఇప్పుడు తమిళనాడులో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన గౌతమ్ మీనన్ ని పిలిచి మరీ ప్రాజెక్టు అప్పచెప్పినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











