twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనస్పర్థలు వదిలేసి ఆ మ్యూజిక్ డైరక్టర్ తోనే...

    By Srikanya
    |

    Gautham Menon
    చెన్నై : స్త్టెలిష్‌ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అజిత్‌ చిత్రం ద్వారా ఈ మధ్యలో దూరమైన తన ఆస్థాన సంగీత దర్శకుడితో మళ్లీ చేయి కలిపాడు. ప్రేమకథ, ఎన్‌కౌంటర్‌ తరహా చిత్రాల ద్వారా దర్శకుడిగా తనకంటూ ఓ పంథాను సృష్టించుకున్న దర్శకుడు గౌతమ్‌మీనన్‌. తన తొలి చిత్రం మిన్నలే నుంచి కాక్కకాక్క, వేట్టయాడు విలైయాడు, వారనం ఆయురం అంటూ అన్ని చిత్రాలకు సంగీత బాధ్యతను హరీష్‌ జైరాజ్‌కే అప్పగించారు. ఆయన కూడా అంతే అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించాడు.

    అయితే అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవటంతో గౌతమ్‌ మీనన్‌ ఇతరుల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన రూపొందించిన 'విన్నైతాండి వరువాయా'కు ఏఆర్‌ రెహమన్‌, 'నీదానే ఎన్‌ పొన్‌ వసంతం'కు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్‌తో హరీష్‌ మళ్లీ కలిసి పని చేయనున్నాడు., అజిత్‌ హీరోగా గౌతమ్‌ నిర్మించనున్న ఓ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అజిత్‌తో తనకు ఇదే తొలి చిత్రం కావటంతో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట గౌతమ్‌ మీనన్‌. ఇందులో భాగంగా గతంలో తనకు ఎన్నో సూపర్‌హిట్‌ పాటలను అందించిన హరీష్‌ జైరాజ్‌ వైపే మొగ్గు చూపాడట.

    నాగచైతన్యకి 'ఏ మాయ చేశావె" చిత్రంతో హిట్ ఇచ్చి కెరీర్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం అంటే హీరోలందరికీ ఆసక్తే. అయితే రీసెంట్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్యతో అనుకున్న చిత్రం ఆగిపోయింది. కథ కుదరలేదని మరీ సూర్య ఆ ప్రాజెక్టు ఆపుచేసి,మరో సినిమా ప్రారంభించేసాడు. అంతకుముందు విజయ్ సైతం గౌతమ్ మీనన్ కి హ్యాండ్ ఇచ్చాడు. అయితే గౌతమ్ మీనన్ మాత్రం సూపర్ స్టార్ హీరోతో జత కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆ స్టార్ హీరోనే అజిత్. అజిత్ ఇప్పుడు తమిళనాడులో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన గౌతమ్ మీనన్ ని పిలిచి మరీ ప్రాజెక్టు అప్పచెప్పినట్లు సమాచారం.

    English summary
    
 
 Rift between Gautham Menon and Harris Jayaraj seems to be finally coming to an end. And the duo is likely to join hands for none other than Ajith's next movie! Yes, the talks are on and audience could expect something positive emerging out in the coming days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X