హీరో డేట్స్ కోసం ఇద్దరు స్టార్ దర్శకుల పోటీ..ఫైనల్
నాగచైతన్యతో... 'ఏమి మాయ చేసావే ' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దర్శకుడు స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్. ఆ తర్వాత ఆయన తమిళంలో చేసిన చిత్రాలుకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆయన మరో చిత్రం కమిటయ్యారుయ. గతంలో 'కాక్క కాక్క'(తెలుగు ఘర్షణ) తో సూర్య కి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆయన మరోసారి సూర్యతో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు.
'కాక్క కాక్క' తర్వాత సూర్యతో ... 'వారనం ఆయిరం' చేసినా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ సూర్య మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది గౌతంమీననే. వీరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. మూడోసారి ముచ్చటగా వీరు కలిసి పనిచేయనున్నారు.
ప్రస్తుతం 'సింగం- 2' చిత్రీకరణలో ఉన్న సూర్య.. అది పూర్తికాగానే గౌతం చిత్రంలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. గౌతంమీనన్ నిర్మాతగా ఫొటోన్ కథాస్ బ్యానరుపై ఈ చిత్రం నిర్మితం కానుంది. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. తన తర్వాతి చిత్రానికి కూడా సూర్య పచ్చజెండా వూపాడు.
ఈ సినిమాను తిరుపతి బ్రదర్స్ బ్యానరుపై మరో స్టార్ డైరక్టర్ లింగుస్వామి నిర్మించనున్నారు. ఆగస్టులో చిత్రీకరణ ఆరంభిస్తారు. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో తెరకెక్కించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సూర్య దృష్టి మొత్తం 'సింగం- 2' మీదే ఉంది. అలాగే ఈ రెండు చిత్రాలు తెలుగు,తమిళ భాషల్లో విడుదల అవుతాయి.


Click it and Unblock the Notifications












