కమల్, రజనీకాంత్ ని డైరక్ట్ చేయలని ఉంది..
రజనీకాంత్,కమల్ హాసన్ లని డైరక్ట్ చేయాలని ఉందని ప్రముఖ దర్సకుడు గౌతమ్ మీనన్ కోరికను వ్యక్తం చేసారు. అలాగే వారిద్దరు కలిసి చేయబోయే చిత్రానికి డైరక్టర్ అయితే బావుంటుందని అన్నారు. తను చిన్నప్పటి నుంచి వారి చిత్రాలు చూస్తూ ఎదిగానని అన్నారు.వారిని డైరక్ట్ చేయటమే తన జీవితంలో మిగిలిన పెద్ద కోరిక అన్నారు. పరిశ్రమకు వచ్చిన ఈ పదేళ్ళలో తాను కమల్ తో రాఘవన్ చిత్రం తీసానని, అది గొప్ప ఎక్సపీరియన్స అని, రజనీతో చేయటం కూడా అద్బుతంగా భావిస్తానని అన్నారు. తన తాజా చిత్రం ఎర్ర గులాబీలు ప్రమేషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా తన మనస్సులో మాటను వ్యక్యం చేసారు. మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన 'ఎర్ర గులాబీలు' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. సమీరారెడ్డి ప్రధాన పాత్రధారి అయిన ఈ చిత్రంలో కథకి కీలకమైన మరో పాత్రని సమంత చేసింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్నారు.


Click it and Unblock the Notifications











